IPL 2022 Retention-Will KL Rahul, Rashid Khan receive 1 year ban from IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంగం సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 15వ సీజన్లో రెండు కొత్త జట్లు చేరనున్న నేపథ్యంలో బీసీసీఐ మెగా వేలంను ప్లాన్ చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ()IPL Auction 2022 ముందు ప్రస్తుతం ఉన్న 8 జట్లు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు మంగళవారమే (November 30) చివరి తేది. దాంతో అన్ని ప్రాంఛైజీలు తన ఆటగాళ్ల జాబితాను సిద్దంచేసుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవచ్చు. ఇక కొత్త జట్లు లఖ్‌నవూ (Lucknow franchise), అహ్మదాబాద్‌లు డిసెంబరు 1 నుంచి 25లోపు గరిష్టంగా ముగ్గురేసి క్రికెటర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని ఎంపిక చేసుకోనుంది, ఎవరిని వదులుకోనుందన్న విషయం ఆసక్తిగా మారింది.
ఈరోజు రిటైన్ ప్లేయర్స్ జాబితాను (IPL 2022 Retention) సమర్పించేందుకు 8 జట్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రిటెన్షన్‌కు ముందు ఇద్దరు ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (KL Rahul-Punjab Kings) మరియు రషీద్ ఖాన్ (Rashid Khan-Sunrisers Hyderabad) ఒక సంవత్సరం పాటు నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొత్త ప్రాంచైజీ లఖ్‌నవూ ఈ ఇద్దరు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ముందుగానే కలిసిందట. దాంతో తమ ఆటగాళ్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని పంజాబ్, హైదరాబాద్ ప్రాంచైజీలు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు ఓ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
Also Read: 83 Trailer Out: కపిల్ దేవ్ 83 మూవీ ట్రైలర్ వచ్చేసింది.. భారత అభిమానులకు గూస్ బంప్సే!!
'తమ జట్టు ఆటగాళ్లను లఖ్‌నవూ ఫ్రాంఛైజీ మభ్యపెట్టేందుకు (కొనుగోలు చేసేందుకు) ప్రయత్నించిందని పంజాబ్ కింగ్స్, రైజర్స్ హైదరాబాద్ ఫిర్యాదు చేశాయి. ఐతే లిఖితపూర్వక లేఖ మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఏదేమైనా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. ఇది నిజమని తెలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం. ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల వివరాలను సమర్పించకముందే ఇలా ఆటగాళ్లను కలవడం సమంజసం కాదు' అని బీసీసీఐ అధికారు ఒకరు చెప్పినట్టు ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ తమ కథనంలో రాసుకొచ్చింది. ఇది నిజమే అయితే కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై సంవత్సర నిషేధం పడనుందట. అలానే సదరు ప్రాంచైజీపై కూడా కఠిన చర్యలు తప్పవట.
Also Read: Srimukhi : శ్రీముఖి పాట విని స్పృహ కోల్పోయిన నాగబాబు, వైరల్ అవుతోన్న వీడియో
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ (KL Rahu) అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని సీజన్లుగా 500లకు పైగా పరుగులు చేస్తున్నాడు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఘనత అతడి సొంతం. ఐపీఎల్ 2021 సీజన్లో రాహుల్ 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు చేశాడు. కింగ్స్ పంజాబ్ అతన్ని వదులుకోవడానికి ఇష్టపడనప్పటికి.. రాహుల్ కొత్త జట్టులోకి వస్తే మాత్రం భారీ మొత్తం దక్కే అవకాశం ఉంది. ఒకవేళ రాహుల్‌ను పంజాబ్ రిటైన్ చేసుకున్నా.. నిబంధనల ప్రకారం 16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెన్నెముక అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేటి బ్యాటర్‌ను సైతం తన అద్భుత బంతులతో బోల్తాకొట్టిస్తుంటాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook