Gautam Gambhir picks his 4 retentions for Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో వేలం జరుగనుంది. ఐపీఎల్ 15వ సీజన్ కోసం రిటెన్షన్ జాబితా సమర్పించేందుకు ఈరోజే (మంగళవారం) తుది గడువు. మధ్యాహ్నం 12 గంటల్లోపు జాబితాలను అందజేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ప్రాంచైజీలకు తెలిపింది. ఇక రాత్రి 9.30 గంటలకు ఈ రిటెన్షన్ వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. అయితే ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా ఇప్పటికే లీక్ అయింది. అందుకు సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐపీఎల్ 2022 కోసం నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుందని సమాచారం తెలుస్తోంది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఆల్‌రౌండర్ మోయిన్ అలీ, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌లను తీసుకున్నట్లు సమాచారం. ఈ నలుగురి కోసం చెన్నై 42 కోట్లు వెచ్చించనుంది. అయితే కెప్టెన్ ధోనీ కన్నా జడేజాకే భారీ ధరను చెల్లించిందని ఫ్రాంచైజీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమయంలో టీమిండియా మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ సారథి గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భారీ షాక్ ఇచ్చాడు.
Also Read: IPL 2022 Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై సంవత్సర నిషేధం?.. అసలు కారణం ఏంటంటే?
ఫ్రాంచైజీల నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు రిటైన్ చేసుకునే నలుగురు ఆటగాళ్లను గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఎంపిక చేశాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఫాఫ్ డుప్లెసిస్ మరియు సామ్ కరన్‌లను గౌతీ ఎంచుకున్నాడు. తాను ఎంచుకున్న జాబితాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గౌతీ చోటివ్వలేదు. రాబోయే సీజన్లో తాను చెన్నైకి ఆడతానని మహీ స్పష్టం చేసినా.. గంభీర్ అతడిని ఎంపిక చేసుకోకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిస్తోంది. ఏదేమైనా మహీ మొదటి రిటెన్షన్‌గా ఉండే అవకాశం ఉంది. ఇక స్టార్ ప్లేయర్స్ సురేశ్ రైనా, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డుప్లెసిస్, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్‌లను చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేయనుంది.
Also Read: Pakistani Model Photoshoot: కర్తార్ పూర్ గురుద్వారా ఎదుట ఫొటోషూట్.. వివాదంలో పాకిస్తానీ మోడల్
బీసీసీఐ (BCCI) రిటెన్షన్ రూల్స్ ప్రకారం 8 ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను అంటిపెట్టుకోవచ్చు. ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను అంటిపెట్టుకోవచ్చు. అయితే అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఇద్దరిని మించకూడదు. నలుగురిని రిటైన్ చేసుకుంటే.. తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 12 కోట్లు, మూడో ఆటగాడికి రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. దాంతో ప్రతి ఫ్రాంచైజీ రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. దాంతో మిగిలిన రూ. 48 కోట్లతోనే చెన్నై (CSK) మిగతా ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది.
సీఎస్కే కోసం గౌతీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీరే:
# రుతురాజ్ గైక్వాడ్
# రవీంద్ర జడేజా
# ఫాఫ్ డుప్లెసిస్
# సామ్ కరన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook