/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

David Warner: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇక మెగా ఆక్షన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటెన్షన్ జాబితాపై డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో పరిశీలిద్దాం.

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ జనవరి నెలలో జరగనుంది. అన్ని ఫ్రాంచైజీ జట్లు ఇప్పటికే తమ తమ ఆటగాళ్లు రిటెన్షన్ జాబితాను వెల్లడించాయి. అనూహ్యంగా చాలాజట్లు కీలకమైన ఆటగాళ్లను వదులుకున్న పరిస్థితి కన్పిస్తోంది. అందరికంటే ఆశ్చర్యం కల్గించే అంశం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రకటించిన రిటెన్షన్ జాబితా. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్, కీలక బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ను ఆ జట్టు వదులుకుంది. ఐపీఎల్ 2021 ద్వితీయార్ధంలోనే డేవిడ్ వార్నర్‌ను ఆ జట్టు యాజమాన్యం పక్కకు తప్పించడంతో ఈసారి రిటెన్షన్‌లో అతని పేరు లేకపోవడం పెద్దగా ఆశ్చర్యం కల్గించలేదు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో టాప్ ఛాయిస్‌లో ఉంటాడనుకున్న ఆఫ్ఘనిస్తాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్‌ఖాన్‌ను (Rashid Khan) తప్పించడమే అందర్నీ ఆశ్చర్యపర్చింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) యాజమాన్యం కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను రిటైన్ చేసుకుంది. విలియమ్సన్‌తో రషీద్ ఖాన్ విభేదాలే  దీనికి కారణంగా తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటెన్షన్‌పై డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాప్టర్ ముగిసింది..అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ వార్నర్ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఐపీఎల్ వేలంగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. 2016 ఐపీఎల్‌‌లో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడమే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి టైటిల్ సాధించిపెట్టాడు. ఆరెంజ్ క్యాప్ మూడుసార్లు గెల్చుకున్న ఏకైక బ్యాట్స్‌మెన్ కూడా డేవిడ్ వార్నర్ (David Warner) కావడం విశేషం. డేవిడ్ వార్నర్ ఇన్‌స్టా పోస్ట్‌కు తగ్గట్టుగా ఇక ఐపీఎల్‌కు (IPL) దూరంగా ఉంటాడా లేదా మరే ఇతర ఫ్రాంచైజీకైనా ఆడతాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. 

Also read: Moeen Ali Retention Reason: మొయిన్ అలీని చెన్నై సూపర్‌కింగ్స్ ఎందుకు రిటైన్ చేసుకుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
David Warner key comments on the retention list of sunrisers hyderabad team
News Source: 
Home Title: 

David Warner : ఐపీఎల్‌కు డేవిడ్ వార్నర్ గుడ్ బై చెప్పేస్తున్నాడా..ఆ పోస్ట్‌కు కారణమేంటి..?

David Warner : ఐపీఎల్‌కు డేవిడ్ వార్నర్ గుడ్ బై చెప్పేస్తున్నాడా..ఆ పోస్ట్‌కు కారణమేంటి..?
Caption: 
David Warner ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటెన్షన్ జాబితాపై స్పందించిన డేవిడ్ వార్నర్

ఛాప్టర్ ముగిసింది, అందరికీ ధన్యవాదాలంటూ ఇన్‌స్టాలో పోస్ట్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు డేవిడ్, రషీధ్ ఖాన్‌లను ఎందుకు వదులుకుంది

Mobile Title: 
David Warner: IPLకు డేవిడ్ వార్నర్ గుడ్ బై చెప్పేస్తున్నాడా...ఆ పోస్ట్‌కు కారణమేంటి?
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Thursday, December 2, 2021 - 12:06
Created By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
104
Is Breaking News: 
No