Omicron Scare: ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశంలో ప్రవేశించగానే తడాఖా చూపిస్తోంది. మరో ముగ్గురు విదేశీ ప్రయాణీకులు ఢిల్లీ ఆసుపత్రిలో చేరడం ఆందోళన కల్గిస్తోంది.
ఇండియాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు విదేశీ ప్రయాణాలు చేసి వచ్చినవారిలో కొత్త వేరియంట్ భయం వెంటాడుతోంది. ఢిల్లీ లోకనాయక్ ఆసుపత్రిలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన ముగ్గురు చేరడం ఆందోళన రేపుతోంది. ఇందులో ఇద్దరికి కోవిడ్ నిర్ధారణ కాగా, మరొకరి పరిస్థితి అనుమానంగా ఉంది. ఈ ముగ్గురిని ఒమిక్రాన్ సోకిన ఇతరులతో కలిపి చికిత్స అందిస్తున్నారు.
దేశంలో ఇప్పటి వరకూ ఒమిక్రాన్ కేసులు(Omicron Cases)26కు చేరాయి. ఇందులో 19 పాజిటివ్ కేసులు కాగా మరో 7 అనుమానంగా ఉన్నాయి. దుబాయ్, ఫ్రాన్స్, యూకే నుంచి వచ్చిన ఈ ముగ్గురు భారతీయులే. ఇందులో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ కాగా మరొకరి పరీక్ష ఫలితాలు రావల్సి ఉంది. మొత్తం రెండు వ్యాక్సిన్లు పూర్తి చేసుకుని టాంజేనియా నుంచి ఢిల్లీకు చేరుకున్న 37 వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని తేలింది. ఢిల్లీకు సంబంధించి ఇదే తొలికేసు. రాంచీకు చెందిన ఇతను..టాంజేనియా(Tanzania) నుంచి దోహాకు వెళ్లాడు. అక్కడి నుంచి కతార్ ఎయిర్‌వేస్ ద్వారా డిసెంబర్ 2 వ తేదీన ఢిల్లీకు చేరాడు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్‌బర్గ్‌లో ఓ వారం రోజులు గడిపిన ఇతనికి స్వల్ప లక్షణాలున్నాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 17 శాంపిల్స్‌లో 12 శాంపిల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఇందులో 11 కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)నెగెటివ్‌గా తేలింది. అయితే కోవిడ్ 19 నెగెటివ్ వచ్చేవరకూ ఈ 11 మందిని కూడా ఐసోలేషన్‌లో ఉంచనున్నారు.
Also read: Omicron cases in India: మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook