Bipin Rawat's mortal remains at Palam airport: తమిళనాడులో ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ప్రమాదంలో అమరులైన డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ అంతిమ నివాళి అర్పించారు. త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో 12 మంది పార్థివదేహాలను ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్‌కి తీసుకురాగా.. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ (PM Modi) అక్కడికి చేరుకుని వారికి నివాళి ఘటించారు.
#WATCH PM Narendra Modi leads the nation in paying tribute to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat and other 11 Armed Forces personnel who lost their lives in the military chopper crash yesterday pic.twitter.com/6FvYSyJ1g6
— ANI (@ANI) December 9, 2021
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం పాలం ఎయిర్ బేస్‌లోనే జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తో పాటు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో 11 మంది పార్థివదేహాలకు నివాళి అర్పించారు. అనంతరం అమరుల కుటుంబాలకు సానుభూతి తెలిపి వారికి ధైర్యం చెప్పారు.
Defence Minister Rajnath Singh pays last respects to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat and other 11 Armed Forces personnel who lost their lives in the #TamilNaduChopperCrash yesterday. pic.twitter.com/TZI0XoAUZd
— ANI (@ANI) December 9, 2021
నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా జనరల్ బిపిన్ రావత్ పార్థివ దేహానికి అంతిమ నివాళి అర్పించారు.
Delhi | NSA Ajit Doval pays tributes to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat and other 11 Armed Forces personnel who lost their lives in the IAF chopper crash yesterday pic.twitter.com/7owdaiZPfh
— ANI (@ANI) December 9, 2021
Also read : Group Captain Varun Singh : హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ ఒక్కడు..ధైర్య సాహాసాలకు కేరాఫ్ అడ్రస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook