Funny Video: ఆటోమేటిక్‌గా కదిలిన సూట్‌కేస్.. ఇదేం విడ్డురంరా అయ్యా.. ఎవరో లాగినట్టు ఉరికింది!

సోషల్ మీడియాలో నిత్యం వింత వింత వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి.. కొన్ని భయంకరంగా ఉంటే.. మరికొన్ని నవ్వులను పూయిస్తాయి.. అయితే విమానాశ్రయంలో ఒక లగేజీ బ్యాగు దానంతట అదే పరిగెత్తే వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 05:52 PM IST
  • సోషల్ మీడియాలో వింత వీడియోలకు కొదవేలేదు
  • దానంతట అదే ఒక సూట్‌కేస్ పరిగెత్తింది
  • రన్ వే పై ఎవరో పిలిచినట్టుగానే ఎలా వెళ్లిందో చూడండి
Funny Video: ఆటోమేటిక్‌గా కదిలిన సూట్‌కేస్.. ఇదేం విడ్డురంరా అయ్యా.. ఎవరో లాగినట్టు ఉరికింది!

Suitcase Moves Automatically in the Airport: సోషల్ మీడియాలో నిత్యం వింత వింత వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి.. కొన్ని భయంకరంగా ఉంటే.. మరికొన్ని నవ్వులను పూయిస్తాయి.. అయితే విమానాశ్రయంలో ఒక లగేజీ బ్యాగు దానంతట అదే పరిగెత్తే వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. 

ఒంటరిగా సూటికేసు ఎక్కువ దూరం కదులుతున్న ఈ ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా ఇలాంటి కారణం లేని, తల-తోక లేని వీడియోలే ఎక్కవ మందిని ఆకర్షిస్తాయి. ఇది కూడా అలాంటిదే.. 

Also Read: Scary Video: భయానికే భయం పుట్టించే వీడియో..20 అడుగుల పాము చిన్న పాప వైపు.. ఏం జరిగింది..??

మాములుగా విమానాశ్రయాల్లో అందరు తమ తమ సూటికేసులను లాక్కుంటూ తీసుకెళ్తారు..  కానీ ఈ వీడియోలో సూటికేసు దానంతట అదే కదులుతూ వెళ్లటం మనం చూడవచ్చు. 

అమెరికాలోని (America) టెక్సాస్‌ విమానాశ్రయంలో (Texas Airport) అనుకోకుండా ఒక సూట్‌కేస్ కింద పడింది.. పడటం ఆలస్యం లేదు.. రన్‌వేపై (Run Way) ఎవరో లాగినట్టుగా సూటిగా పరిగెత్తటం మనం చూడవచ్చు. ,

సూట్‌కేస్‌ పరిగెత్తుతున్న క్రమంలో చాలా వాహనాలు వస్తుండగా.. అంతేకాకుండా పక్క నుండి ఒక ట్రక్కు కూడా వేగంగా వెళ్లటం మనం చూడవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News