Cheteshwar Pujara: దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవాలంటే.. ఇదే మంచి అవకాశం: పుజారా

దక్షిణాఫ్రికాలో టీమిండియా టెస్టు సిరీస్‌ సాధించాలంటే ఇదే మంచి అవకాశమని భారత టెస్ట్ బ్యాటర్ చేటేశ్వర్ పుజారా అన్నాడు. భారత జట్టు ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శన చేస్తుందని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి విదేశీ పిచ్‌లపై విజయాలు సాదించిందన్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 05:31 PM IST
  • దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవాలంటే.. ఇదే మంచి అవకాశం
  • టీమిండియాకు ఫాస్ట్‌ బౌలర్లు పెద్ద బలం
  • డ్రెస్సింగ్ రూమ్‌లో ఎక్కువ సమయం గడపొచ్చు
Cheteshwar Pujara: దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవాలంటే.. ఇదే మంచి అవకాశం: పుజారా

Cheteshwar Pujara feels Team India have a best chance to win a Test series in South Africa: దక్షిణాఫ్రికాలో టీమిండియా టెస్టు సిరీస్‌ సాధించాలంటే ఇదే మంచి అవకాశమని భారత టెస్ట్ బ్యాటర్ చేటేశ్వర్ పుజారా  (Cheteshwar Pujara) అన్నాడు. భారత జట్టు ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శన చేస్తుందని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి విదేశీ పిచ్‌లపై విజయాలు సాదించిందన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన (South Africa Tour) కోసం భారత్ ఇప్పటికే అక్కడికి చేరుకుంది. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) సారథ్యంలో టీమిండియా టెస్ట్ ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలెట్టారు. డిసెంబర్ 26 నుంచి భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య తొలి టెస్ట్ ఆరంభం కానుంది. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ఆరంభం కానుంది. 

జోహన్నెస్‌బర్గ్‌లో సాధన చేస్తున్న చేటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీసుకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడాం. టెస్ట్ మ్యాచులకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఉందని నేను  అనుకుంటున్నాను. యువకులు కూడా ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. మా ఆటగాళ్లు చాలా మంది ఫామ్‌లో ఉన్నారు. కొందరికి ఇక్కడ ఆడిన అనుభవం కూడా ఉంది. దక్షిణాఫ్రికాలో మా మొదటి సిరీస్ గెలవడానికి ఇది మాకు ఉత్తమ అవకాశం' అని అన్నాడు. 

Also Read: Salman Butt: మిగతా దేశాలు అలా చెయ్యట్లేదు.. అందుకే టీమిండియా దూసుకెళుతోంది: పాక్ మాజీ కెప్టెన్

టీమిండియాకు ఫాస్ట్‌ బౌలర్లు పెద్ద బలం. వారు ఈ పరిస్థితులను ఉపయోగించుకోగలరే నమ్మకం ఉంది. ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో 20 వికెట్లు తీస్తారని నేను ఆశిస్తున్నాను. మేము విదేశాలలో ఆడినప్పుడల్లా ఇదే చేశారు. ప్రత్యర్థి జట్లకు, మాకు ఇదే తేడా. ఆస్ట్రేలియా సిరీస్‌ను గానీ ఇంగ్లండ్ సిరీస్‌ను గానీ పరిశీలిస్తే.. బౌలింగ్ యూనిట్‌ బాగా రాణించింది. దక్షిణాఫ్రికాలో కూడా అదే జరుగుతుందని నేను నమ్ముతున్నా. ఫాస్ట్‌ బౌలర్లు గత కొన్నేళ్లుగా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెలరేగుతారు' అని చేటేశ్వర్ పుజారా ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Also Read: Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... అయితే ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి..

బయో-బబుల్ కొంత జట్టుకు ఉపయోగపడుతుందని చేటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) అబిప్రాయపడ్డాడు. 'కొన్నిసార్లు మీరు టీమ్ ప్లేయర్‌లతో ఎక్కువ సమయం గడిపే సమయం బయో-బబుల్ ద్వారా దక్కుతుందని నేను భావిస్తున్నాను. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎక్కువ సమయం గడపొచ్చు. ఎక్కువగా టీమ్ డిన్నర్లు చేయొచ్చు. బయో-బబుల్ ఇలా కొన్నిసార్లు జట్టుకు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. బయో-బబుల్ ద్వారా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. బయటకు వెళ్లడానికి అనుమతి ఉండదు, స్వేచ్చగా తిరగలేం. కొన్నిసార్లు కుటుంబాలకు కొద దూరం కావాల్సి ఉంటుంది' అని పుజారా చెప్పాడు. దక్షిణాఫ్రికాలో ఇదివరకు ఎప్పుడూ భారత్ టెస్టు సిరీస్‌ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఈసారి చరిత్ర సృష్టించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చివరగా 2018లో 1-2తో భారత్ టెస్ట్ సిరీస్ ఓడింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News