ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ తో ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని సంసద్ రోడ్డులో చేపట్టిన ఆంధ్రుల 'ఆత్మగౌరవ దీక్ష' స్థలానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చారు. ఏపీ విషయంలో కేంద్రం దిగివచ్చేవరకు పోరాటం ఆగదని ఈ సదర్భంగా చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవాల్సిందే అని అన్నారు. విభజన చట్టాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పోరాటం ఆపదని చెప్పారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం, ద్రోహం చేస్తున్నదని రాహుల్ విమర్శించారు. రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోనికి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సహా ఇతర కాంగ్రెస్ నేతలు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.
Congress President Rahul Gandhi meets party workers in #AndhraPradesh, who are protesting at Parliament Street over 'special category status' for the state. pic.twitter.com/igPdTwA8ME
— ANI (@ANI) March 6, 2018
We are for Special Category Status for Andhra Pradesh. The first thing we will do when we come to power in 2019 is give the state Special Category Status.Confident that if we stand together we will convince GoI & PM that what is due to people of state should be given:Rahul Gandhi pic.twitter.com/6WltZ1ioz2
— ANI (@ANI) March 6, 2018