Raamam Raaghavam Song release form RRR Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన ఈ సినిమాను రూ.600 కోట్ల బడ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి.. బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌ను ఆధారంగా సినిమా 1920 బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. టాలీవుడ్ సినిమా కీర్తిని ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్.. జనవరి 7న విడుదల కానుంది.
సినిమా విడుదలకు సమయం దగ్గరపడతుండంతో ప్రమోషన్స్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రోమోలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై ఉన్న భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఆర్ఆర్ఆర్ నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశారు. 'రైజ్ ఆఫ్ రామ్' (Rise Of Ram) పేరుతో విడుదల చేసిన ఈ సాంగ్.. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో గొప్పతనాన్ని ఎలివేట్ చేసింది. శివ శక్తి దత్త రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ తదితరులు ఆలపించారు. ఈ పాటను శివ శక్తి దత్త సంస్కృతంలో రాశారు. ఈ పాటతో తెలుగు సినీ అభిమానులకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ (Alia Bhatt) నటిస్తుండగా.. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగే పోరాట యోధుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn) కనిపించనున్నారు. బ్రిటీష్ యువరాణిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ కనిపిస్తుండగా.. బ్రిటీష్ అధికారి పాత్రలో మరో హాలీవుడ్ నటుడు రాయ్ స్టవ్ సన్ నటిస్తున్నారు. సముద్రఖని, శ్రియ లాంటివారు ప్రత్యేక పాత్రలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. మరో ఐదు భాషల్లో కూడా సినిమాను అనువాదం చేసి విడుదల చేయబోతున్నారు.
Also Read: Covid 19 Third Wave: కరోనా థర్డ్ వేవ్.. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలపై పేలుతున్న జోకులు, మీమ్స్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి