Virat Kohli: కోహ్లీ పేరు పక్కన అది లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది.. సమయం పడుతుంది: ఆకాష్ చోప్రా

భారత జట్టులో విరాట్ కోహ్లీ పేరు పక్కన సి (కెప్టెన్) లేకపోవడం తనకు ఇబ్బందిగా అనిపించిందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా తెలిపాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 07:55 PM IST
  • కోహ్లీ పేరు పక్కన C లేకపోవడం ఇబ్బందిగా ఉంది
  • విరాట్ ఇప్పుడు కెప్టెన్ కాదు
  • C మరచిపోవడానికి సమయం పడుతుంది
 Virat Kohli: కోహ్లీ పేరు పక్కన అది లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది.. సమయం పడుతుంది: ఆకాష్ చోప్రా

I felt really awkward seeing no c beside Virat Kohli's name says Aakash Chopra: దక్షిణాఫ్రికాతో త్వరలో ఆరంభం కానున్న మూడు మ్యాచ్‎ల వన్డే సిరీస్ కోసం శుక్రవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయం నుంచి కోలుకోకపోవటంతో.. అతడి స్థానంలో లోకేష్ రాహుల్‌ (KL Rahul)ను కెప్టెన్‎గా ఎంపిక చేసింది. టెస్టు సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) ఉన్నప్పటికీ.. పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. యువ, సీనియర్ ఆటగాళ్లకు జట్టులో చోటుదక్కింది. అయితే జట్టు ఎంపికపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. భారత జట్టులో విరాట్ కోహ్లీ పేరు పక్కన సి (Captain) లేకపోవడం తనకు ఇబ్బందిగా అనిపించిందని తెలిపాడు. 

ఆకాష్ చోప్రా (Aakash Chopra) తాజాగా తనం యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ... 'నేను నిజాయితీగా అందరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. విరాట్ కోహ్లీ పేరు తర్వాత 'సి' లేదు. అది నిజంగా చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే కొన్నేళ్లుగా  'సి' అనే లెటర్ మనం చూస్తున్నాము' అని అన్నాడు. 'ఇటీవల టీ20 సిరీస్‌లో మనం 'సి'ని చూడలేదు. అయితే విరాట్ ఆ సిరీస్‌లో భాగం కాదు. ఏదేమైనా విరాట్ ఇప్పుడు కెప్టెన్ కాదు. ఈ విషయం మనందరికీ ఇప్పటికే తెలుసు. కానీ దాన్ని మరచిపోవడానికి సమయం పడుతుంది' అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. 

Also Read: Chris Gayle: క్రిస్‌ గేల్‌కు ఘోర అవమానం.. ఇక రేపోమాపో రిటైర్మెంట్!!

గతేడాది యూఏఈ (UAE)లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2021 అనంతరం విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. నిజానికి ఐపీఎల్ 2021 రెండో దశకు ముందే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ చెప్పాడు. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను టీ20 కెప్టెన్ (T20I Captain)‎గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఆ తర్వాత కొన్నిరోజులకు కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించి రోహిత్‌కే పగ్గాలు అప్పగించింది. ఈ వ్యవహారం బీసీసీఐ, భారత క్రికెట్‌లో పెద్ద దుమారమే రేగింది. మాజీలు అందరూ ఎవరికి తోచింది వారు చెప్పారు. ఇప్పుడిప్పుడే ఆ విషయం సద్దుమణుగుతోంది. 

Also Read: RRR Postponed: ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఒమిక్రాన్ ధాటికి రిలీజ్ వాయిదా

భారత వన్డే జట్టు: 
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, శర్దూల్ ఠాకుర్, మొహ్మద్ సిరాజ్. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News