Vaccination of children: దేశంలో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్​ ప్రారంభం- భారీగా స్పందన!

Vaccination of children: దేశవ్యాప్తంగా పిల్లల వ్యాక్సినేషన్​కు భారీగా స్పందన లభిస్తోంది. 15-18 ఏళ్ల టీనేజర్లు వ్యాక్సినేషన్​ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం కొవాగ్జిన్ మాత్రమే ఇస్తున్నారు వైద్య సిబ్బంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 10:37 AM IST
  • ప్రారంభమైన పిల్లల వ్యాక్సినేషన్​
  • టీనేజర్ల నుంచి భారీ స్పందన
  • ప్రస్తుతానికి కొవాగ్జిన్​కు మాత్రమే అనుమతి
Vaccination of children: దేశంలో 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్​ ప్రారంభం- భారీగా స్పందన!

Vaccination of children: దేశంలో 15-18 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్​ ప్రారభమైంది. కొవిన్​ యాప్​ లేదా వెబ్​ సైట్లో రిజిస్ట్రర్​ చేసుకున్న (Registration for children vaccine) వారికి వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నారు.

ప్రభుత్వం, ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు.. ప్రస్తుతం కొవాగ్జిన్​ టీకా మాత్రమే పిల్లలకు అందుబాటులో (Covaxin for children vaccine) ఉంది. పెద్దలకు ఇచ్చినట్లుగానే 0.5 ఎంఎల్ చొప్పున టీకా ఇస్తున్నారు సిబ్బంది. పిల్లకు కూడా రెండు డోసుల్లోనే టీకా ఇవ్వనున్నారు. రెండు డోసుల మధ్య కనీసం 4 వారాల గడువు (Gap between two doses for children vaccine) విధించారు.

వ్యాక్సిన్​లు మిక్సింగ్​ కాకుండా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని ప్రభుత్వం వైద్య సిబ్బందికి సూచించింది.

భారీ స్పందన..

పిల్లకు వ్యాక్సిన్​కు భారీగా స్పందన లభిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు 6.80 లక్షల మంది వ్యాక్సిన్​ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పిల్లల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే తొలి రోజే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

టీకా తీసుకున్న తర్వాత 30 నిమిషాలు అక్కడే..

పిల్లకు టీకా ఇస్తున్న నేపథ్యంలో వారిపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు వైద్య సిబ్బంది. టీకా తీసుకున్న తర్వాత దాదాపు 30 నిమషాలపాటు వారిని పరిశీలనలో ఉంచుతున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ కనిపించలేదని నిర్ధారించుకున్న తర్వాతే బయటకు పంపిస్తున్నట్లు వెల్లడించారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ​ ఇలా (Children vaccine Registration process)..

పెద్దలకు రిజిస్ట్రేషన్ చేసినట్లుగానే.. పిల్లకు కూడా కొవిన్​ ద్వారా రిజిస్ట్రేషన్ (How to register for child vaccination) చేయాలి.

ముందుగా కొవిడ్ యాప్​ లేదా పోర్టల్​లోకి వెళ్లి ఫోన్ నంబర్ ఎంటర్​ చేయాలి (తల్లి దండ్రుల ఫోన్ నంబర్లను ఇవ్వొచ్చు).

ఒకే నంబర్​పై నాలుగు రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంది. అంటే.. తల్లి దండ్రులు ఇద్దరూ ఒకే ఫోన్ నంబర్​ను వినియోగించి.. టీకా తీసుకున్నా మరో ఇద్దరికి అదే ఫోన్​ నంబర్ వినియోగించే వీలుంది.

పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఆధార్​ నంబర్​ వంటి వివరాలను ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ వీలవకుంటే.. దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్​కు వెళ్లి రిజిస్ట్రేషన్​ చేసుకునే వీలుంది.

Also read: Corona cases in India: ఒక్క రోజులో 33 వేల కరోనా కేసులు- థార్డ్​ వేవ్​కు సంకేతమా?

Also read: Five State Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికల వాయిదాపై సర్వత్రా డిమాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News