Actor John Abraham: బాలీవుడ్​కు కరోనా సెగ... హీరో జాన్ అబ్రహం, అతడి భార్యకు పాజిటివ్

Actor John Abraham: బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో పాటు అతడి భార్యకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 11:24 AM IST
Actor John Abraham:  బాలీవుడ్​కు కరోనా సెగ... హీరో జాన్ అబ్రహం, అతడి భార్యకు పాజిటివ్

Actor John Abraham: దేశంలో సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్​లో ఇప్పటికే కరీనా కపూర్, అర్జున్​కపూర్, సన్యా కపూర్, మృనాల్ ఠాకూర్, నోరా ఫతేహి, శిల్పా శిరోద్కర్‌లతో సహా పలువురు ప్రముఖులకు కొవిడ్ పాజిటివ్​గా ( COVID positive) నిర్ధారణ అయ్యింది. తాజాగా హీరో జాన్ అబ్రహంతో (Actor John Abraham) పాటు అతడి భార్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని జాన్ ఇన్​స్టా (Instagram) వేదికగా వెల్లడించారు. 

''మూడురోజుల కిందట తాను ఓ వ్యక్తిని కలిశానని, అతడికి పాజిటివ్​గా తేలడం వల్ల తాను, భార్య ప్రియ వైద్య పరీక్షలు చేసుకున్నామని... తామిద్దరికి కొవిడ్ పాజిటివ్​గా తేలడంతో...ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నామని'' జాన్ అబ్రహం తెలిపారు. అభిమానులందరూ మాస్క్​లు ధరించి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జాన్ అబ్రహం నటించిన 'సత్యమేవ జయతే 2' (Satyameva Jayate2).. జనవరి 25న విడుదల కావాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆదివారం దర్శకుడు రాహుల్ రావైల్(70) (Rahul Rawail) కూడా కోవిడ్ బారిన పడ్డారు. రాహుల్ రావైల్ 1983లో అర్జున్, 1985లో బేతాబ్, 1991లో మస్త్ కలందర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Also Read: Jersey Heoine: జెర్సీ హీరోయిన్ మృణాల్‌కు కోవిడ్ పాజిటివ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News