Durgi NTR statue: దుర్గి ఘటన దురదృష్టకరం: వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి

Durgi NTR statue: గుంటూరు జిల్లా దుర్గి ఘనటను ఖండిస్తున్నట్లు ప్రభుత్వం విప్​, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ ఘనటను టీడీపీ రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 02:16 PM IST
  • దుర్గి ఘననపై మాచర్ల ఎమ్మెల్యే స్పందన
  • ఘటనను ఖండిస్తున్నట్లు వెల్లడి
  • ఇలాంటి దాడులకు వైసీపీ వ్యతిరేకమని స్పష్టం
Durgi NTR statue: దుర్గి ఘటన దురదృష్టకరం: వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి

Durgi NTR statue: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి గ్రామంలో ఎన్​టీఆర్ విగ్రహ ధ్వంసం యత్నం ఘనటపై ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి స్పందించారు. స్థానిక శాసన సభ్యుడిగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ఎప్పుడు కూడా ఇలాంటి ఘనటనలను ప్రోత్సహించదని ( YCP MLA Ramakrishna reddy about Durgi issue) పేర్కొన్నారు.

రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరం..

ఈ ఘనట దృరదృష్టకరమన్నారు రామకృష్ణా రెడ్డి. ఇది చాలా పెద్ద విషయమని పేర్కొన్నారు. ఎన్​టీఆర్ అంటే అందరికీ గౌరవమేనన్నారు.

ఎన్​టీఆర్​, వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి వంటి నాయకులు ఏపీని పరిపాలించారని.. వారి గౌరవార్థం ప్రజలు వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయని.. వారందరిని గౌరవించాల్సిన అవసరముంది స్పష్టం చేశారు.

అయితే ఈ ఘనటనను తెలుగు దేశం పార్టీ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని (YCP MLA Ramakrishna reddy on TDP) ఆరోపించారు. ఈ విషయం దురదృష్టకరమన్నారాయన.

ఈ ఘనటనకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. యాదృచ్ఛికంగా జరిగిందేనని పేర్కొన్నారు.

లా అండ్​ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నారు..!

ఈ మధ్యే మాచర్ల నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇన్​ఛార్జిని తీసుకొచ్చిందన్నారు రామకృష్ణా రెడ్డి. 15 ఏళ్లు నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్లిన వ్యక్తిని రప్పించి ఆ బాధ్యలు అప్పగించారన్నారు. అతనికున్న ఫ్యాక్షన్ నేపథ్యాన్ని అడ్డు పెట్టుకుని లా అండ్​ ఆర్డర్ సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపనలు చేశారు. టీడీపీ నేతలు చేసే దుష్ప్రచాలు నమ్మోద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దాడులకు వైసీపీ పూర్తిగా విరుద్దమని వివరించారు.

ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందే..

పల్నాడు ప్రాంతంలో ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే.. చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు రామకృష్ణా రెడ్డి. కొత్తగా వచ్చిన వ్యక్తులు అల్లర్లు చేసి లా ఆండ్ ఆర్డర్​ సమస్యలు తేవాలను చూస్తే కచ్చితంగా అది ఎవరైనా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also read: Attempt to destroy NTR statue: దుర్గిలో ఎన్​టీఆర్​ విగ్రహం ధ్వంసానికి యత్నం!

Also read: Vizag RK beach: విహారయాత్రలో విషాదం..ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఐదుగురి గల్లంతు..రెండు మృతదేహాలు లభ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News