Telangana Lock down: తెలంగాణలో ఈ నెలాఖరు నుంచి లాక్​డౌన్​?

గడిచిన ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ రాగా.. ఇప్పుడు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు (Corona cases in Telangana) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా కట్టడి చర్యలు ప్రారంభించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 05:59 PM IST
  • తెలంగాణలో కరోనాపై హెల్త్​ డైరెక్టర్​ కీలక వ్యాఖ్యలు
  • లాక్​డౌన్ పెట్టే అంశంపై క్లారిటీ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
Telangana Lock down: తెలంగాణలో ఈ నెలాఖరు నుంచి లాక్​డౌన్​?

Telangana Lock down: గడిచిన ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ రాగా.. ఇప్పుడు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు (Corona cases in Telangana) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా కట్టడి చర్యలు ప్రారంభించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.

తెలంగాణలో కరోనా కేసులు ఇలా పెరుగుతూ పోతే రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్ పెడతారా? అన్న ప్రశ్నకు రాష్ట్ర హెల్త్​ డైరెక్టర్​ (డీఎహెచ్​) శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.

కేసులు ఇలానే పెరుగుతూ పోతే.. ఈ నెలాఖరు వరకు లాక్​డౌన్ గానీ కర్ఫ్యూ వంటివి విధించే (Curfew in Telangana) అవాకశముందని శ్రీనివాసరావు చెప్పారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉడాలని సూచిచారు డీహెచ్​. మాస్కులు ధరించడం (Mask mandatory in Telangana), భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు. అర్హులంతా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 84 ఒమిక్రాన్​ కేసులు 3,779 యాక్టివ్ కరోనా కేసులు (Corna Active cases in Telangana) ఉన్నట్లు వెల్లడించారు డీహెచ్​.

ఇతర రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు..

కరోనా కేసుల ఆందోళనల నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పశ్చిమ్​ బెంగాల్​లో లాక్​డౌన్​ తరహా ఆంక్షలు (Lock down in West bengal) నేటి నుంచే అమలులోకి వచ్చాయి. స్కూళ్లు, సినిమా హాళ్ల వంటివి మూసేసింది ప్రభుత్వం. విమానాల రాకపోలకపై కూడా అంక్షలు విధించనుంది. వారానికి రెండు రోజులు మాత్రమే విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వనుంది.

మహారాష్ట్రలో కొవిడ్ కేసులు (Corona cases in MH) ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీనితో త్వరలోనే ఆ రాష్ట్రంలో కూడా కఠిన ఆంక్షలు అమలయ్యే అవకాశాలున్నాయి.

Also read: Bhadradri Kothagudem: విషాదం: ఇంట్లో గ్యాస్ లీక్.. కుమార్తె సహా దంపతులు సజీవదహనం!

Also read: Revanth Reddy: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్​- ఏడాదిలోపే రెండో సారి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News