Journalist makes history with Tattoo : ఆ టాటూతో వార్తలు చదివిన న్యూస్ రీడర్.. ప్రపంచం మొత్తం తెలిసేలా చేశావ్!

Journalist makes history first Person with Maori Face Tattoo : మావోరీ తెగకు సంబంధించిన టాటూతో వార్తలు చదివిన న్యూస్ రీడర్ ఒరిని కైపారా. సోషల్ ​మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో.. ఆ కల్చర్ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశావు అంటూ ప్రశంసలు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 11:06 PM IST
  • గడ్డంపై టాటూతో ప్రైమ్ న్యూస్ చదివిన న్యూస్ రీడర్

  • సోషల్ ​మీడియాలో వీడియో వైరల్
  • మావోరీ ట్రైబ్‌ కల్చర్‌‌కు ప్రతీకగా టాటూ వేసుకున్న న్యూస్ రీడర్
Journalist makes history with Tattoo : ఆ టాటూతో వార్తలు చదివిన న్యూస్ రీడర్.. ప్రపంచం మొత్తం తెలిసేలా చేశావ్!

Journalist makes history she becomes first Person with Maori Face Tattoo To Anchor Primetime News : న్యూస్ రీడర్స్ కామన్‌గా చాలా అట్రాక్టివ్‌గా రెడీ అయి వార్తలు చదువుతుంటారు. ప్రొఫెనల్‌ లుక్‌లో కనపిస్తుంటారు. కానీ ఓ న్యూస్ రీడర్ మాత్రం కాస్త భిన్నంగా కనిపించి ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంది. ఫేస్‌పై టాటూ వేసుకుని ప్రైమ్ న్యూస్ బులిటెన్‌లో వార్తలు చదివింది ఆమె. 

న్యూజిలాండ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తన గడ్డంపై డిఫరెంట్ టాటూతో న్యూస్ చదవడంతో ఈమె ఇప్పుడు వార్తల్లో నిలిచారు. దీనికి ఒక రీజన్ ఉంది. అసలు ఈ టాటూకు వెనకున్న హిస్టరీ ఏమిటి.. దీనికి ఎందుకంత ప్రత్యేకత అనే విషయాన్ని చూద్దాం పదండి.. 

గడ్డంపై టాటూతో న్యూస్ చదివిన ఆమె పేరు ఒరిని కైపారా. (Oriini Kaipara) వయసు 37 ఏళ్లు. న్యూజిలాండ్​లో (New Zealand) ఒక న్యూస్​ ఛానెల్​లో ఈమె పనిచేస్తోంది. ఈమె వీడియో ఇప్పుడు సోషల్ ​మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈమె గడ్డంపై వేసుకున్న ఆ టాటూ సరదాకు వేసుకున్నది కాదు. అది వారి సంప్రదాయంలో ఒక భాగం. ఒరిని కైపారా.. మావోరీ (Maori) తెగకు చెందిన ఆమె. ఈ ​తెగకు చెందిన ఆడవారు వారి సంప్రదాయంలో భాగంగా గడ్డం మీద టాటూ వేయించుకుంటారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Oriini Kaipara (@oriinz)

 

ఈ టాటూను మోకో కౌయే (moko kauae) అని అంటారు. అయితే 2017లో ఒరిని కైపారా డీఎన్​ఏ టెస్ట్​ చేయించుకుందట. ఆ టెస్ట్‌లో ఒరిని కైపారా.. మావోరీ తెగకు చెందినట్లుగా తేలిందట. దీంతో ఆమె మావోరీ తెగ (Maori tribe) సంప్రదాయానికి గుర్తుగా మావోరీ టాటూ తన గడ్డంపై వేయించుకుంది. 

maori

ఇక ఆ టాటూతో (Tattoo) తాజాగా ఆమె పని చేసే న్యూస్ ఛానెల్‌లో ప్రైమ్​ టైమ్​ న్యూస్​ చదివింది. సాధారణంగా ఆమె ప్రైమ్‌టైమ్‌లో కాకుండా ఇతర బులిటెన్స్ న్యూస్ చదివేది. అయితే ఇప్పుడు ప్రైమ్​ టైమ్‌ బులెటిన్ న్యూస్ (Primetime News) చదవడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైర​ల్ అవుతోంది.

Also Read :Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 482 కరోనా కేసులు.. 84కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

ఫేస్‌పై అలాంటి టాటూతో న్యూస్ చదివిన మొదటి మహిళా జర్నలిస్ట్‌గా వార్తల్లోకి ఎక్కింది ఒరిని కైపారా. ఇక మావోరీ ట్రైబ్‌ (Maori Tribe) కల్చర్ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశావు అంటూ ఇప్పుడు ఒరిని కైపారాను మెచ్చుకుంటున్నారు నెటిజెన్స్. (Netizens)

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Oriini Kaipara (@oriinz)

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Oriini Kaipara (@oriinz)

 

Also Read :Tiger Bear Fight: పులిని వెంటాడి, వేటాడిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News