Todays Gold Price: బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. గత రెండ్రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర తిరిగి పెరగడం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాల్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. బంగారం ధరల్లో మార్పులకు చాలా కారణాలు ప్రభావితమవుతుంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ వంటి చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరగడ లేదా తగ్గడం జరుగుతుంది. దేశంలోని పలు ముఖ్య నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Price)10 గ్రాముల ధర 46 వేల 750 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేలుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 6 వందలుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 920 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేలుంది. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 850 రూపాయలుంది. అటు 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర 49 వేల 550 రూపాయలుగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 6 వందల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 650 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 340 రూపాయలుంది. 

ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad Gold Rate) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 6 వందలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 650 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 6 వందలు కాగా,24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  48 వేల 650 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: Todays Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

English Title: 
Gold Rate Slightly increases, todays gold price in different cities of india
News Source: 
Home Title: 

Todays Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు
Caption: 
Gold price today ( file photo)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Todays Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, January 9, 2022 - 07:40
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
44
Is Breaking News: 
No

Trending News