Nizamabad Family Suicide Case : ఆ నలుగురిని వదలి పెట్టకండి.. వారే మా చావుకు కారణం

Nizamabad Family Suicide Case update Suicide Letter goes viral : విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్‌ కుటుంబం సూసైడ్‌ లెటర్ వైరల్. ఆ నలుగురిని వదలి పెట్టకండి అంటూ సూసైడ్‌ నోట్ రాసిన పప్పుల సురేష్‌ కుటుంబం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 11:41 PM IST
  • విజయవాడలో నిజామాబాద్‌కు చెందిన కుటుంబం ఆత్మహత్య కేసులో అప్‌డేట్
  • అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తట్టుకోలేకే సూసైడ్
  • వైరల్ అవుతోన్న సూసైడ్‌ నోట్
  • ఆ నలుగురిని శిక్షించాలంటూ లెటర్
Nizamabad Family Suicide Case : ఆ నలుగురిని వదలి పెట్టకండి.. వారే మా చావుకు కారణం

Nizamabad Family Suicide Case update Suicide Letter goes viral Family commits suicide due to financial stress: తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన కుటుంబం తాజాగా విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విజయవాడలో (Vijayawada) దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్‌ (58), ఆయన భార్య శ్రీలత (54), కుమారులు అఖిల్‌ (26), ఆశిష్‌ (24) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఈ కేసులో క్రమంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పులు ఇచ్చిన వారి వేధింపులే తమ ఆత్మహత్యకు (Suicide) కారణమంటూ ఆ కుటుంబం సూసైడ్‌ (Family Suicide‌) నోట్‌లో వెల్లడించింది. ఆత్మహత్యకు ముందు ఆ ఫ్యామిలీ మెంబర్స్‌ ఒక సూసైడ్‌ నోట్‌ రాశారు. అందులో వారిని ఇబ్బందులు పెట్టిన వారి వివరాలు పేర్కొన్నారు. 

అలాగే సూసైడ్‌ లెటర్‌‌తో (Suicide letter) పాటు తమను వేధించిన వారి వివరాలకు సంబంధించిన ఒక సెల్ఫీ వీడియో (Selfie video) కూడా తీశారు. అందులో కూడా ఫైనాన్స్‌ వారి ఒత్తిడి తట్టుకోలేకే తాము సూసైడ్‌ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు పప్పుల సురేష్‌ కుటుంబం రాసిన సూసైడ్‌ లెటర్‌‌ (Suicide letter) వైరల్ అవుతోంది.

తమ కుటుంబం చావుకు ఆ నలుగురే కారణమంటూ, గణేష్‌కుమార్‌, వినీత, చంద్రశేఖర్‌, సాయి రామ మనోహర్‌ పేర్లను సూసైడ్‌ నోట్‌లో రాశారు. తమ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని లేఖలో కోరారు.

Also Read : Telangana Corona Update: తెలంగాణలో కరోనా విజృంభణ... కొత్తగా 1,673 మందికి పాజిటివ్!

ఇక మృతుడు సురేష్‌ బావమరిది రాంప్రసాద్‌ మరిన్ని వివరాలు వెల్లడించారు. తమ అక్క, బావ వారి ఇద్దరు కుమారులు ఆత్మహత్య చేసుకోవడానికి ఆ నలుగురే కారణమని చెప్పారు. వారి వేధింపులు భరించలేకే తమ బావ కుటుంబం విజయవాడలో ఆత్మహత్యకు (Suicide) పాల్పడిందన్నారు. ఆ నలుగురు అధిక వడ్డీలు (High interest rates) వసూలు చేశారని తెలిపారు. బెదిరింపులకు కూడా పాల్పడ్డారన్నారు.

Also Read : Weather Alert: తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు వడగళ్ల వానలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News