Wine Policy: వైన్ తాగి డ్రైవ్ చేస్తే అరెస్టు చేస్తారా బార్ ఎక్కడుందో చూపిస్తారా, వైరల్ అవుతున్న ట్వీట్

Wine Policy: వైన్ తాగి..డ్రైవింగ్ చేయవచ్చా లేదా..ఈ ప్రశ్న ముంబైకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల్ని అడిగాడు. మరి దీనికి పోలీసులు ఏం సమాధానమిచ్చారు. అదే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 30, 2022, 02:57 PM IST
Wine Policy: వైన్ తాగి డ్రైవ్ చేస్తే అరెస్టు చేస్తారా బార్ ఎక్కడుందో చూపిస్తారా, వైరల్ అవుతున్న ట్వీట్

Wine Policy: వైన్ తాగి..డ్రైవింగ్ చేయవచ్చా లేదా..ఈ ప్రశ్న ముంబైకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల్ని అడిగాడు. మరి దీనికి పోలీసులు ఏం సమాధానమిచ్చారు. అదే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పోలీసు శాఖలు చాలా అరుదుగా ఉంటాయి. యాక్టివ్ గా ఉన్నప్పుడు నెటిజన్లు కూడా చాలా సందర్భాల్లో తిక్క తిక్క ప్రశ్నలు వేస్తుంటారు. పోలీసులు ఊరుకుంటారా మరి. అదే రీతిలో సమాధానాలిస్తుంటారు. అదే జరిగింది ముంబైకి చెందిన ఓ వ్యక్తి పోలీసుల్ని అడిగిన ప్రశ్న. సోషల్ మీడియాలో ఈ ప్రశ్న..పోలీసులిచ్చిన జవాబు వేగంగా వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త వైన్ పాలసీను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సూపర్ మార్కెట్, కిరాణా స్టోర్స్‌లలో వైన్ విక్రయాలు చేసుకోవచ్చు. (Mumbai police befitting reply to a netigen on twitter about maharashtra new wine policy)

ఈ కొత్త వైన్ పాలసీను బీజేపీ వ్యతిరేకించింది. అయితే ఇది రైతుల ప్రయోజనార్ధం తీసుకున్న నిర్ణయమని శివసేన నేత సంజయ్ రౌత్ సమాధానమిచ్చారు. వైన్ అనేది మద్యం కాదని..వైన్ అమ్మకాలు పెరిగితే రైతులకు ప్రయోజనముంటుందని చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకించడం ఒక్కటే తెలుసని..రైతుల కోసం ఏం చేయలేదని చెప్పారు. 

సంజయ్ రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై శివమ్ వహియా అనే ఓ వ్యక్తి ట్విట్టర్‌పై వ్యంగ్యంగా ముంబై పోలీసులకు ట్వీట్ చేస్తూ ఓ ప్రశ్న సంధించాడు. ఇప్పుడు ఒకవేళ నేను వైన్ తాగి డ్రైవ్ చేస్తుంటే..మీరు నాకు దగ్గరలోని బార్ అడ్రస్ చూపిస్తారా లేకా జైళ్లో వేస్తారా అని ప్రశ్నించాడు. దీనికి ముంబై పోలీసులు దీటైన సమాధానమే ఇచ్చారు. సర్..మీరొక బాధ్యత కలిగిన పౌరుడిగా మందు తాగి డ్రైవ్ చేయవద్దు. ఒకవేళ బ్రీత్ ఎనలైజర్‌లో ఆల్కహాల్ దొరికితే..మీరు కటకటాల వెనుక మా అతిధిగా ఉండాల్సి వస్తుంది. ఇదీ పోలీసులిచ్చిన సమాధానం.

ముంబై పోలీసులిచ్చిన ఈ సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరూ ముంబై పోలీసుల్ని ప్రశంసిస్తున్నారు. సరైన సమాధానమిచ్చారంటున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ అనేది మంచిది కాదని..అలా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాలని..నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని కూడా సూచిస్తున్నారు. 

Also read: Martyrs Day: అమరవీరుల దినోత్సవం ఎప్పుడు, గాంధీ వర్ధంతి రోజునా లేక మార్చ్ 30 వతేదీనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News