IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్, లక్నో జట్లతో సహా అనీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు శుభ్‌మన్ గిల్‌ను వదులుకోవడంపై కేకేఆర్ జట్టు హెచ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. (KKR Coach Brendon Mccullum comments on Shubman Gill and Retention of players list)
ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు మరి కొద్దిరోజులు మాత్రమే మిగిలింది. ప్రఖ్యాత క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను వదులుకోవడం కేకేఆర్ జట్టు అనూహ్య నిర్ణయమే. ఐపీఎల్ 2021 లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో 8వ స్థానంలో నిలిచిన శుభ్‌మన్ గిల్‌ను కేకేఆర్ జట్టు ఎందుకు వదులుకుందనేది ఆశ్చర్యమే. అయితే ఈసారి ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ మాత్రం శుభ్‌మన్ గిల్ ప్రత్యేకతను గుర్తించింది. మెగా వేలం కంటే ముందే ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకుని..8 కోట్లతో శుభ్‌మన్ గిల్‌ను దక్కించుకుంది. అటు కేకేఆర్ జట్టు మాత్రం ఆండ్రీ రస్సెల్‌కు 12 కోట్లు, వరుణ్ చక్రవర్తికి 8 కోట్లు, వెంకటేశ్ అయ్యర్‌కు 8 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది. శుభ్‌మన్ గిల్ విషయంలో కేకేఆర్ జట్టు తీసుకున్న నిర్ణయంపై ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రతిభ కలిగిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను దూరం చేసుకోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని మెకల్లమ్ స్పష్టం చేశాడు. కేకేఆర్ జట్టు రిటైన్షన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కల్గించిందన్నాడు. ఎందుకంటే శుభ్‌మన్ గిల్ కేకేఆర్ జట్టు తరపున 58 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో 17 ఇన్నింగ్స్‌లలో 478 పరుగులు సాధించాడు. ఇక సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లు చాలాకాలంగా సేవలందిస్తున్నారని చెప్పాడు. ఇక వరుణ్ చక్రవర్తి సామర్ధ్యం, వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ 2021 రెండవ దశలో సృష్టించిన విధ్వంసం అందరికీ తెలిసిందేనన్నాడు. ఆండ్రీ రస్సెల్ ఎలాంటి అద్భుతాలు చేయగలడో అందరికీ తెలుసని..ఈ క్రమంలో కొంతమంది ఆటగాళ్లను వదులుకోవల్సి వచ్చిందన్నాడు. శుభ్‌మన్ గిల్ ఆ కోవలోకే వస్తారని చెప్పాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే..మెగా వేలానికి పక్కా ప్రణాళిక సిద్ధమైందని మెకల్లమ్ వెల్లడించాడు. ఫిబ్రవరి 12, 12 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది.
Also read: IND vs WI: ఇంగ్లండ్‌ను ఓడించాం.. తర్వాత టీమిండియానే! విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
IPL 2022 Mega Auction: శుభ్‌మన్ గిల్‌ను వదులుకోవడం తప్పే..కేకేఆర్ జట్టు కోచ్ వ్యాఖ్య