RGV vs Pawan Kalyan: రామ్ గోపాల్ వర్మ. ఓ వివాదాస్పద దర్శకుడు. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉండే ఆర్డీవీ మరోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశాడు. ఇంకెప్పుడు పాన్ ఇండియా హీరో అవుతారంటూ..చేసిన ఆ వ్యాఖ్యలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
రామ్ గోపాల్ వర్మ నిర్మొహమాటంగా..చెప్పాలనుకున్నది చెప్పి తీరతారనేది అందరి అభిప్రాయం. అదే సమయంలో ఒకరిని టార్గెట్ చేయడంలో కూడా ఆయన తరువాతే ఎవరైనా. వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో ఆర్జీవీకు ప్రత్యేకత ఉంది. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే ఆర్జీవీ మరోసారి లక్ష్యంగా ఎంచుకున్నాడు. పవన్ కళ్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పవన్‌ను ఎద్దేవా చేస్తున్నాడా లేదా నిజంగానే అలా కోరుకుంటున్నాడో తెలియకుండా ట్వీట్లు చేశాడు.(Ram gopal varma targets pawan kalyan and tweets )
ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు @tarak9999 , @AlwaysRamCharan కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
పవన్ కళ్యాణ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా చూడాలని కోరుకుంటున్నట్టు ఆర్జీవీ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్- రానా ప్రధానపాత్రల్లో నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ఆర్జీవీ కోరాడు. ఇటీవల విడుదలైన పుష్ప సినిమా భారీ వసూళ్లతో సక్సెస్ సాధించిందని..భీమ్లానాయక్ ఇంకెంత వసూళ్లు చేయాల్సి వస్తుందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా వరుస ట్వీట్లతో పవన్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇటీవల తాను అల్లు అర్జున్ గురించి పెట్టిన ట్వీట్స్..వోడ్కా సమయంలో పెడితే..పవన్‌పై పెట్టిన ట్వీట్స్ మాత్రం కాఫీ టైమ్‌లో పెట్టినవని గుర్తు చేశాడు. దీన్ని బట్టి తన సీరియస్‌నెస్ అర్దం చేసుకోవాలని కోరాడు. ఎప్పుడో మీ తరువాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పాన్ ఇండియా స్టార్లుగా మారుతుంటే ఇంకా మీరు తెలుగులోనే సినిమాలు చేయడం బాధగా ఉందన్నాడు ఆర్జీవీ. భీమ్లానాయక్ సినిమాను పాన్ ఇండియాగా విడుదల చేయాలంటూ వరుస ట్వీట్లతో హీటెక్కించాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలో విడుదల చేయవద్దని ట్విట్టర్‌లో ఎంత మొత్తుకున్నా వినలేదని గుర్తు చేశాడు. దాని ఫలితాన్ని చూశారని..ఇప్పుడు ఈసారి మాత్రం భీమ్లానాయక్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి..పవర్ ప్రూవ్ చేయాలని సవాలు విసిరాడు ఆర్జీవీ.
Also read: Vijay Devarakonda: ట్విట్టర్ ఖాతా పేరు మార్చిన విజయ్ దేవరకొండ...కారణమేంటంటే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook