Google Trending Video: ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఈవెంట్లలో ఫ్యాషన్ షో ఒకటి. న్యూయార్క్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ క్రిస్టియన్ కోవన్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ధరించి ఓ మోడల్ ర్యాంప్‌పై ఓ వ్యక్తిని తన కోటుతో కొట్టబోయింది. ఆ వ్యక్తి అనుచిత కామెంట్స్ చేయడం వల్ల ఆ మోడల్ కొట్టబోయిందని సమాచారం. ఈ ఫ్యాషన్ షో కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏం జరిగిందంటే?
కాస్ట్యూమ్ డిజైనర్ క్రిస్టియన్ కోవన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ ఫ్యాషన్ షోకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో మోడల్ నలుపు, గులాబీ రంగు క్రాప్ టాప్.. మినీ స్కర్ట్ సెట్‌ని ధరించి ఫ్యాషన్ షోలో తన ర్యాంప్ వాక్ ను ప్రారంభించింది. ఆమె ర్యాంప్ వాక్ చేస్తున్న క్రమంలో అక్కడున్న ప్రేక్షకుల కేరింతలు కొడుతూ ఆమెకు స్వాగతం పలికారు.
స్టేజ్ పై నడుస్తున్న క్రమంలో ఆ మోడల్.. తన చేతిలోని కోట్ ను తీసి గ్యాలరీలో ఉన్న ఓ వ్యక్తిపై కోపంతో కొట్టబోయింది. కానీ, వెంటనే తన కోటును వెనక్తి తీసుకొని.. మళ్లీ తన ర్యాంప్ వాక్ ను కొనసాగించింది. అప్పటి వరకు సరదాగా కొనసాగిన షో ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. అయితే ఆ సంఘటనతో అక్కడున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆ మోడల్ ర్యాంప్ వాక్ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి అసభ్యకరంగా కామెంట్ చేయడం వల్ల ఆమె అలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
గతవారం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వ్యూస్ రావడం సహా 18,372 లైక్ కొట్టారు. ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఈ వీడియో టిక్ టాక్ లోనూ వైరల్ గా మారింది. అందులో రెండు మిలియన్లకు పైగా వీక్షణలు లభించాయి. వీడియోలోని మోడల్ పేరు థియోడోరా క్విన్లివాన్ అని క్రిస్టియన్ కోవాన్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈ వీడియోను చూసిన పలువురు పలు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Minnal Murali Wedding Shoot: 'మిన్నాళ్ మురళి' స్టైల్లో ప్రీ వెడ్డింగ్ షూట్..వైరల్ అవుతున్న వీడియో..
Also Read: Secret Treasures in Guntur: ఆలయ తవ్వకాల్లో బయటపడిన గుప్త నిధులు.. అందులో ఏమున్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.