Nellore Police: మహిళా పోలీసుల యూనిఫాం కొలతలకు జెంట్స్‌ టైలర్‌.. నెల్లూరు పోలీసుల తీరుపై విమర్శలు..

Nellore: నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మహిళా పోలీసుల యూనిఫాం కొలతలను తీసేందుకు పురుషులను వినియోగించడంపై రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 07:12 PM IST
  • నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన
  • లేడీ కానిస్టేబుల్స్​కు జెంట్ టైలరింగ్
  • ఎస్పీ విజయారావు సీరియస్
Nellore Police: మహిళా పోలీసుల యూనిఫాం కొలతలకు జెంట్స్‌ టైలర్‌.. నెల్లూరు పోలీసుల తీరుపై విమర్శలు..

Nellore Police: నెల్లూరు పోలీసుల తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. పట్టణంలోని ఉమేశ్‌చంద్ర హాలులో సోమవారం సచివాలయ మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కోసం జెంట్స్‌ టైలర్‌తో (Male tailors) కొలతలు తీయించారు.  పక్కనే మహిళా పోలీసులు ఉన్నా, వారితో కొలతలు తీయించకుండా పురుషులు కొలతలు తీసుకోవడంతో మహిళా కానిస్టేబుళ్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయ్యాయి. నెల్లూరు పోలీసుల (Nellore Police) తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.

ఈ ఘటనపై ఎస్పీ విజయారావు స్పందించారు. మహిళా పోలీసుల (female constables) యూనిఫాం  బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు అప్పజెప్పామని.. ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిదిద్దామని ఆయన అన్నారు. అనుమతిలేని ప్రదేశంలోకి ప్రవేశించి ఫొటోలు తీసిన గుర్తు తెలియని వ్యక్తిపైనా చట్టపరమైన చర్యలకు ఎస్పీ ఆదేశించారు. మహిళా టైలర్లు లేని కారణంగానే..యూనిఫాం కొలతలు పురుషులతో తీయించాల్సి వచ్చిందని నెల్లూరు ఏఎస్పీ వెంకటరత్నం వివరణ ఇచ్చారు. దీనిపై అనవసర రాద్దాంతం చేయడం సరికాదన్నారు.

Also Read: Anantapur JNTU Issue: అనంతపురం జేఎన్‌టీయూలో అరాచకం.. 18 మందిపై సస్పెన్షన్‌ వేటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News