AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు తెలుగు సంవత్సరాదికి ప్రారంభం కానున్నాయి. జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా చేసింది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా విభజించారు. అరకు నియోజకవర్గాన్ని మాత్రం భౌగోళికంగా నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండుగా విభజించారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుపై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. మరోవైపు జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్ని ఉగాది నాటికి అంటే కొత్త తెలుగు సంవత్సరాదికి సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు అంశాల్ని పరిశీలించారు. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాలపై నిర్ణయం వెనుక కారణాల్ని ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనల్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో పాటు హోంమంత్రి సుచరిత, ముఖ్య సలహాదారులు అజేయ కల్లాం, ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. మరోవైపు కొత్త జిల్లాల్లో పరిపాలనకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉగాది పండుగ నాటికి అన్ని కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. కొత్త భవనాలు అందుబాటులో వచ్చేవరకూ..తాత్కాలిక భవనాల్ని గుర్తించి మౌళిక సదుపాయాల్ని కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్(Ap cm ys jagan) సూచించారు.
Also read: MLC Ashok Babu Arrest: అర్ధరాత్రి ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేసిన సీఐడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook