Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని ఇంకా పెద్దది చేయకండి.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

Karnataka Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసర విచారణకు స్వీకరించలేమని తెలిపింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 05:49 PM IST
  • కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు
  • అత్యవసర విచారణకు స్వీకరించలేమన్న సుప్రీం కోర్టు
  • సరైన సమయంలో జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసిన న్యాయస్థానం
 Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని ఇంకా పెద్దది చేయకండి.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

Karnataka Hijab Controversy: కర్ణాటకలో హిజాబ్ వివాదం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతుండగా.. తాజాగా ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడం వివాదాన్ని మరింత పెద్దది చేసినట్లయింది. అయితే సుప్రీం కోర్టు ఆ ప్రయత్నానికి బ్రేక్ వేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసర విచారణకు స్వీకరించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అత్యవసర విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది.

'ఈ విషయాన్ని మరింత పెద్దది చేయకండి. ఏ సమయంలో జోక్యం చేసుకోవాలో మేము చూసుకుంటాం. కర్ణాటకలో ఏం జరుగుతుందో మేం గమనిస్తూనే ఉన్నాం. కర్ణాటక హైకోర్టులో జరుగుతున్న విచారణ గురించి మాకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయాన్ని జాతీయ స్థాయి దాకా తీసుకురావడం సమంజసమేనా.. దీనిపై ఇప్పుడే మేమేమీ చెప్పదలుచుకోలేదు. అయితే అవసరమైనప్పుడు సరైన సందర్భంలో ఈ విషయంలో జోక్యం చేసుకుంటాం.' అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సరైన సమయంలో ఈ ఇష్యూని కోర్టు ముందుకు తెచ్చేలా లిస్టింగ్ చేస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది.

అంతకుముందు, పిటిషనర్ల తరుపు న్యాయవాదుల్లో ఒకరైన దేవదత్ కామత్ కోర్టుకు తన వాదనలు వినిపించారు. సిక్కు విద్యార్థులు తలకు టర్బన్‌తో రావడాన్ని స్కూళ్లలో అనుమతించినప్పుడు.. హిజాబ్‌ను మాత్రం ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. విద్యా సంస్థల్లో మతపరమైన దుస్తులు ధరించవద్దని కర్ణాటక హైకోర్టు ఆదేశాలివ్వడం.. ముస్లిం యువతుల మతపరమైన హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు.

కాగా, కర్ణాటక విద్యా సంస్థల్లో మతపరమైన దుస్తులను నిషేధిస్తూ అక్కడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హిజాబ్‌ వివాదం నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు విద్యార్థులతో పాటు కాంగ్రెస్ నేత ఒకరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. తాజాగా కోర్టు అందుకు తిరస్కరించింది. 

Also Read: Teenmar Mallanna Interview: రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నానంటున్న తీన్మార్ మల్లన్నతో బిగ్ డిబేట్ విత్ భరత్

Also read : Telugu Movies on OTT: ఈ వారం ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతోన్న మూవీలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News