Suresh Raina: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కీలకమైన ఆటగాళ్లను ఈసారి ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి సురేష్ రైనా. సురేష్ రైనాపై సీఎస్కే సహా ఇతర జట్లు ఆసక్తి చూపించకపోవడానికి కారణాలేంటనేది తెలుసుకుందాం.
ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ముగిసింది. ఆశ్చర్యకరమైన పరిణామాలు, అనూహ్య ధరలతో ఆటగాళ్లక పంట పండితే..మరికొందరికి తీవ్ర నిరాశ ఎదురైంది. కొంతమంది ఆటగాళ్లకు ఊహించిన ధర లభించలేదు. ముఖ్యంగా సురేష్ రైనా వంటి కీలకమైన ఆటగాళ్లను ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసింది. వాస్తవానికి సురేష్ రైనాను సీఎస్కే జట్టు మళ్లీ కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. దీనికి గల కారణాల్ని ఆ జట్టు యజమాని శ్రీనివాసన్ ఇప్పటికే వివరించారు. ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ కూడా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.
సురేష్ రైనా తన వ్యక్తిగత కారణాలతో కొన్ని మ్యాచ్‌లకు, మోకాలి శస్త్రచికిత్స కారణంగా మరికొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అటు ఫామ్ కూడా సరిగ్గా లేదు. ఫలితంగా సీఎస్కే యాజమాన్యం నమ్మకాన్ని సురేష్ రైనా కోల్పోవడంతో తిరిగి జట్టులో తీసుకోలేదని శ్రీనివాసన్ చెప్పినట్టు సైమన్ డౌల్ గుర్తు చేశాడు. ఫామ్ కారణంగా ఓ ఆటగాడిని ఏదైనా జట్టు పక్కనబెడితే..మరో జట్టు ఆ ఆటగాడిని కొనుగోలు చేసే సాహసం చేయదని వివరించాడు. ఇదే కారణంతో సురేష్ రైనాను సీఎస్కేతో పాటు మరే ఇతర జట్టు కొనుగోలు చేయలేదని చెప్పాడు.
వాస్తవానికి ఐపీఎల్ పోటీల్లో సురేష్ రైనా సీనియర్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే 2006, 2017 మినహా ప్రతిసారీ సురేష్ రైనా సీఎస్కే (CSK)జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈసారి మాత్రం రిటెన్షన్ జాబితాలోనూ..అటు వేలంలోనూ సీఎస్కే సహా ఏ జట్టూ దక్కించుకోలేదు. ఫామ్ లేకపోవడంతో పాటు వయసు మీద పడటం కూడా మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు సార్లు టైటిల్ గెల్చుకున్న సమయంలో జట్టులో కీలకసభ్యుడిగా ఉండి..205 మ్యాచ్‌లతో 30 సగటుతో 5 వేల 528 పరుగులు సాధించిన సురేష్ రైనా (Suresh Raina) ఆట ఏ జట్టునూ ఆకట్టుకోలేకపోయింది.
Also read: Ravi Bishnoi: రవి బిష్ణోయ్ సూపర్ ఇన్నింగ్స్, 17 డాట్ బాల్స్‌తో అరుదైన ఘనత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook