Ahmedabad Serial Blasts Case Verdict: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2008లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులో 38 మందికి మరణశిక్ష విధించిన కోర్టు.. మరో 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ నెల 8న దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మొత్తం 49 మందిని దోషులుగా తేల్చగా 28 మందిని నిర్దోషులుగా తేల్చింది. పద్నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు ఈ కేసులో తాజాగా దోషులకు శిక్షలు ఖరారయ్యాయి.
జులై 26, 2008లో అహ్మదాబాద్‌లో వరుసగా 21 బాంబు పేలుళ్లు చోటు చోసుకున్నాయి. 70 నిమిషాల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ పేలుళ్లలో 56 మంది మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్, సిమీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడినట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు. 2002లో చోటు చేసుకున్న గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఆరోపించారు.
ఈ కేసులో మొత్తం 78 మంది నిందితులను విచారించగా.. ఇందులో ఒకరు అప్రూవర్‌గా మారారు. మిగతా 77 మందిపై అసాంఘీక కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో విచారణ జరుగుతూ వచ్చింది. 1100 మంది ప్రత్యక్ష సాక్షులను న్యాయస్థానం విచారించింది. 13 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణ గతేడాది సెప్టెంబర్‌లో ముగిసింది. ఈ నెల ప్రారంభంలో 49 మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం తాజాగా వారికి శిక్షలు ఖరారు చేసింది.
Also Read: Video: దారినపోయే వాళ్లకు హీరోయిన్ ఫ్రీ హగ్స్.. మాకూ కావాలంటున్న నెటిజన్లు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook