Food Myths: ఆహారం మనిషి జీవనానికి అత్యంత ప్రధానమైంది. ఆహారం అనేది ప్రాంతాలను బట్టి మారుతుంది. అయితే ఆహారం ఏదైనా.. శరీరానికి శక్తిని, పోషకాలను అందివ్వడమే.. దాని ముఖ్యమైన పని. అందుకే సరైన ఆహారం తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం.
ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధంలా పని చేస్తుంది.. అదే అతిగా తీసుకుంటే విషంగా మారుతుంది అనే మాటల వినే ఉంటారు. ఇది అక్షరాల నిజం. ఆహారానికి మాత్రమే కాదు.. పండ్లకూ ఇది వర్తిస్తుంది.
ఇదే కాకుండా ఆహారం తీసుకోవడంలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల.. విలువైన పోషకాలను కోల్పోతారు. లేదా కొన్ని సార్లు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వీటితో పాటు చాలా మందిలో ఆహారం తీసుకోవడంలో కొన్ని అపోహలు ఉంటాయి. అలాంటి అపోహలను తొగిస్తూ.. ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ దీక్షా భావ్సర్ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి.
అన్నం ఎక్కువగా తింటే బరువు పెరుగుతారా?
అన్నం రోజూ తినడం వల్ల లావు అవడం అనే విషయం నిజం కాదని చెప్పారు డాక్టర్ దీక్షా. అయితే అది కేవలం రోజువారీగా మితంగా అన్నం తింటేనే లావయ్యే అవకాశం లేదన్నారు.
రోజూ బాస్మతీ రైస్‌తో వండిన తినడం వల్ల బరువు అవకాశముందని మాత్రం చెప్పారు డాక్టర్ దీక్షా. ఈ అలవాటు డయాబెటీస్, గుండే జబ్బులకూ దారితీయొచ్చని వివరించారు.
అలా కాకుండా.. ప్రతి రోజు మితంగా.. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, సోనా మసూరీ వంటివి తీసుకోవడం బెటర్ అని చెబుతున్నారామె. ఇవి సులభంగా జీర్ణమవడమే కాకుండా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలకు కారణం కావని అంటున్నారు.
ముఖ్యంగా ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే కిచిడీ తినడం మేలని డాక్టర్ దీక్షా సలహా ఇస్తున్నారు.
మామిడి పండ్లు తినడం వల్ల డయాబెటీస్?
మామిడి పండ్లే కాకుండా సీతాఫలం, అరటి పండ్లు ఏవీ కూడా డయాబెటీస్‌కు దారితియవని డాక్టర్ దీక్షా స్పష్టం చేశారు. అయితే వాటిని అధికంగా తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఎక్కడకు కదలకుండా ఒకే చోట కూర్చోవడం వంటి జీవనశైలి.. డయాబెటీస్‌కు దారితీయొచ్చని అమె వెల్లడించారు.
నెయ్యి తింటే కొవ్వు స్థాయి పెరుగుతుందా?
డాక్టర్ దీక్షా ప్రకారం... నెయ్యి తినడం వల్ల శరీరంలో కొవ్వు మెరుగువుతుంది. ఏ2 అవు నెయ్యి వల్ల శరీరానికి మంచి చేసే కొవ్వు పదార్థాలు పెరుగుతాయి. ఇది శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను పెంచుతాయి. అంతేకాకుండా.. విటమిన్ ఏ, విటమిన్ డీ, విటమిన్ ఈ, విటమిన్ కేలు పుష్కలంగా లభిస్తాయి.
ఏ2 ఆవు పాలను, నెయ్యిని తినడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు డాక్టర్ దీక్షా.
గేదే నెయ్యి అందరూ తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు. ఎవరైతే బరువు పెరగాలని ప్రయత్నిస్తుంటారో వాళ్లకు మాత్రం గేదె నెయ్యి మేలు చేస్తుందని సలహా ఇస్తున్నారు.
Also read: Low BP Symptoms, Remedies: లో బీపీ లక్షణాలు ఏంటి ? ఎలా బయటపడాలి ?
Also read: Drinking Fruit Juice: ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా ? ఐతే రిస్కే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook