'Kalatapasvi' Rajesh passes away: సీనియర్ కన్నడ నటుడు 'కళాతపస్వి' రాజేష్ కన్నుమూత

Actor Rajesh Passes Away: కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు 'కళాతపస్వి'’ రాజేష్ కన్నుమూశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 01:57 PM IST
'Kalatapasvi' Rajesh passes away: సీనియర్ కన్నడ నటుడు 'కళాతపస్వి' రాజేష్ కన్నుమూత

'Kalatapasvi' Rajesh Passes Away: ప్రముఖ కన్నడ నటుడు ‘కళాతపస్వి’ రాజేష్ (89) (Veteran Kannada actor Rajesh passes away) కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో వారం రోజుల కిందట ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయన మృతి పట్ల  కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (CM basavaraj bommai), మాజీ సీఎం సిద్ధరామయ్య సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

రాజేష్ 150 చిత్రాల పైచిలుకు సినిమాల్లో నటించాడు. కొన్ని టీవీ షోలలో కూడా చేశారు. 'వీరసంకల్ప్' చిత్రంతో తెరగ్రేటం చేశారు. 1968లో వచ్చిన 'నమ్మ ఊరు' (Namma Ooru’) చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో.. అతని పేరు ’రాజేష్‌గా మారింది.  'శ్రీ రామాంజేనేయ యుద్ధం',  'గంగ గౌరి' చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. 

2014లో వచ్చిన ఆయన ఆత్మకథ '‘కళా తపస్వి రాజేష్ ఆత్మకథ'’ (Kalathapasvi Rajesh Athmakathe) కన్నడ చిత్రరంగంలో మంచి గుర్తింపు తెచ్చింది. అదే  సంవత్సరంలో ఆయన కన్నడ సాహిత్య పరిషత్‌చే డాక్టర్ రాజ్‌కుమార్ కల్చరల్ ఎండోమెంట్ అవార్డును కూడా అందుకున్నారు. ఈయనకు ఐదుగురు పిల్లలు. వీరిలో కుమార్తె ఆశా రాణి కూడా నటి. ఈమె నటుడు అర్జున్ సర్జాను వివాహం చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం రాజేష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Also Read: Alia Bhatt Bathtub Pics: బాత్‌టబ్ ఫోటోలతో హాట్ హాట్‌గా అలియా భట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News