Mallanna Sagar: మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ప్రారంభం..

Mallanna Sagar: సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజర్వాయర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.  ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు కేసీఆర్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 03:06 PM IST
  • మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ప్రారంభం
  • జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్
 Mallanna Sagar: మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ప్రారంభం..

Mallanna Sagar Project: కాళేశ్వ‌రం (kaleshwaram) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్( Mallanna Sagar) ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు సీఎం ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం రిజ‌ర్వాయ‌ర్‌లోకి సీఎం కేసీఆర్ (CM KCR) నీటిని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విహంగవీక్షణం ద్వారా  కేసీఆర్ ప్రాజెక్టును ప‌రిశీలించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని రిజర్వాయర్స్ కంటే మల్లన్నసాగర్‌ అత్యంత ఎత్తులో ఉన్న జలాశయంగా గుర్తింపు పొందింది. దీనిని 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ  జలాశయానికి 5 ఓటీ స్లూయిస్ లను  ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 11 కంపెనీలు పాలుపంచుకున్నాయి. సుమారు 7వేల మంది కార్మికులు ప్రతి నిత్యం మూడు షిఫ్టుల్లో పని చేశారు.

కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు మల్లన్నసాగర్‌ ద్వారానే నీటిని తరలిస్తారు. నిజాంసాగర్‌, సింగూరు, ఘనపూర్‌ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ రిజర్వాయర్ పైనే ఆధారపడి ఉంది. ఈ జలాశయం ద్వారా 15 లక్షల 71 వేల 50 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. హైదరాబాద్‌ ప్రజల తాగునీటి కోసం 30 టీఎంసీల నీటిని భవిష్యత్తులో సరఫరా చేయనున్నారు. పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు నుంచే నీటిని వినియోగించనున్నారు. 

Also Read: CM KCR: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News