TDP President Chandrababu Naidu slams CM YS Jagan: 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'భీమ్లా నాయక్' ఈరోజు (ఫిబ్రవరి) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. పవన్ కారణంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందని సమాచారం. అయితే ఒక్క ఏపీలో తప్పితే మిగతా అన్ని చోట్లా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే భీమ్లా నాయక్ సినిమా స్పెషల్ షో, ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి.
'భీమ్లా నాయక్' ప్రదర్శనల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ సినిమా షోలకు అనుమతి లేదు. భీమ్లా నాయక్ విడుదల నేపథ్యంలో.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తారేమోనన్న ఉద్దేశంతో ఏపీలోని పలు థియేటర్ల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు పహారా కాచారు. ఇందుకు సంబందించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఆంక్షలపై తెలుగు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ స్పందించగా.. తాజాగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు.
'రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం వైఎస్ జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. 'రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే.. ఏపీ సీఎం మాత్రం భీమ్లా నాయక్ సినిమాపై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నా' అని బాబు వరుస ట్వీట్లు చేశారు.
రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం @ysjagan వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది.(1/4)
— N Chandrababu Naidu (@ncbn) February 25, 2022
భీమ్లా నాయక్ సినిమాపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. 'భీమ్ల నాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా. ఏపీ సీఎం జగన్ ఒక పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను ధ్వంసం చేసి రాష్ట్రాన్ని భిక్షాటన చేసే గిన్నెగా మార్చాలనుకుంటున్నారు. సినీ పరిశ్రమ కూడా అందుకు మినహాయింపు కాదు. భీమ్ల నాయక్ అన్ని కుట్రలను అధిగమించి భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని లోకేష్ ట్వీట్ చేశారు.
Also Read; Bheemla Nayak Review: భీమ్లా నాయక్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
Also Read: Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఇకపై 'పవర్ స్టార్' బిరుదు లేకుండానే!
Hearing tremendous response for #BheemlaNayak. Looking forward to watching it. @ysjagan wants to transform AP into a begging bowl by finishing off one industry after another, movie industry being no exception. I wish #BheemlaNayak overcomes all conspiracies to come out triumphant pic.twitter.com/cqn636HsCU
— Lokesh Nara (@naralokesh) February 25, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook