Sunil Gavaskar wants Virat Kohli to Hit Century in his 100th Test: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. మొహాలీలో శుక్రవారం (మార్చి 4) శ్రీలంకతో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోహ్లీకి వందవ మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వందో టెస్టు మ్యాచ్‌లో విరాట్ వంద కొట్టాలని ఫాన్స్ అందరూ కోరుకుంటున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా కోహ్లీ సెంచరీ చేయాలని ఆశిస్తున్నాడు.
తాజాగా సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... 'వందో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని నేను ఆశిస్తున్నా. శతకం అందుకుంటాడని నా మనసు చెబుతోంది. ఇప్పటి వరకు చాలామంది క్రికెటర్లు ఆ ఫీట్ (100వ టెస్టులో సెంచరీ)ను అందుకోలేదు. నాకు తెలిసి కొలిన్ కౌడ్రే, జావెద్ మియాందాద్, అలెక్స్ స్టీవర్ట్, ఇంజమామ్ ఉల్ హాక్, జో రూట్ సెంచరీలు చేశారు. ఆ జాబితాలో కోహ్లీ కూడా చేరాలని గట్టిగా కోరుకుంటున్నా' అని అన్నారు.
విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి గత రెండేళ్ల నుంచి సెంచరీ చేయలేదు. ఈ విషయంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ... 'లక్ష్యం అందుకోవాలనే తపన ఉండాలి. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటాం. ఆ అవకాశం వచ్చినప్పుడు దానిని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తాం. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కష్టపడతాం. ఇప్పుడు విరాట్ కోహ్లీకి వందో టెస్టు కూడా అలాంటిదే. కోహ్లీ తప్పకుండా తన మార్క్ ఆట చూపిస్తాడు' అని ధీమా వ్యక్తం చేశారు.
విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచుకు ప్రేక్షకులను అనుమతించేది లేదని బీసీసీఐ ముందుగా పేర్కొంది. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో.. వెనక్కి తగ్గింది. చివరకు మొహాలీ టెస్టు మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిని ఇచ్చింది. దాంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కోహ్లీ 99 టెస్టుల్లో 7962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ సెంచరీ కోసం ఆయన ఫాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Radhe Shyam Trailer: రాధేశ్యామ్ మూవీ రెండో ట్రైలర్ వచ్చేసింది..!
Also Read: AP Students in Ukraine: ఇక మరింత వేగంగా విద్యార్ధుల తరలింపు, పోలండ్, హంగేరీ దేశాలకు ఏపీ ప్రతినిధులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook