IPL 2022, Deepak Chahar: ఐపీఎల్ (IPL 2022) కొత్త సీజన్ ప్రారంభం కాకముందే...చెన్నై సూపర్ కింగ్స్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు దీపక్ చాహర్ (Deepak Chahar) ఐపీఎల్లో సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో దీపక్ చాహర్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఈ ఫాస్ట్ బౌలర్ శ్రీలంకతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ 15వ సీజన్ లో చాహర్ ఆరంభ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం ఉంది.
ఐపీఎల్ -2022 మెగా వేలంలో చాహర్ ను చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) రూ. 14 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఈ మెగావేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో చాహర్ రెండో వాడు. ఈ ఏఢాది ఐపీఎల్ 15వ సీజన్ మార్చి26 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని జట్లు మార్చి 14 లేదా 15 నుండి ప్రాక్టీస్ ను ప్రారంభించనున్నాయి. దీనికి కూడా ఈ సీఎస్కే ఆటగాడు అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు.
"చాహర్ 8 వారాల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాలి. అతడు ఐపీఎల్ 2022 మొదటి దశకు అందుబాటులో ఉండడు." అని బీసీసీఐ (BCCI) అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో చాహర్ 20 టీ20లు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు. 7 వన్డేల్లో 10 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటిన చాహర్.. వన్డేల్లో రెండు అర్థశతకాలు నమోదుచేశాడు.
Also Read: Suresh Raina: సురేష్ రైనాకు ఆ అదృష్టం లభిస్తుందా, గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో స్థానం ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook