Prabhas-Anushka: ప్రభాస్‌పై అనుష్కకు ప్రేమ లేదా..లవ్ ఫెయిల్యూర్ అని ఎందుకన్నాడు, ఏం జరిగింది

Prabhas-Anushka: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాగా, డార్లింగ్ టు బాహుబలిగా మారిన ఆరడుగుల అందగాడు ప్రభాస్ పెళ్లెప్పుడనే విషయంపై క్లారిటీ రాకపోయినా..ఆ విషయం క్లియర్ అయింది. సాక్షాత్తూ ప్రభాస్ పెద్దమ్మే ఈ విషయాన్ని వెల్లడించారు

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2022, 06:36 AM IST
Prabhas-Anushka: ప్రభాస్‌పై అనుష్కకు ప్రేమ లేదా..లవ్ ఫెయిల్యూర్ అని ఎందుకన్నాడు, ఏం జరిగింది

Prabhas-Anushka: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాగా, డార్లింగ్ టు బాహుబలిగా మారిన ఆరడుగుల అందగాడు ప్రభాస్ పెళ్లెప్పుడనే విషయంపై క్లారిటీ రాకపోయినా..ఆ విషయం క్లియర్ అయింది. సాక్షాత్తూ ప్రభాస్ పెద్దమ్మే ఈ విషయాన్ని వెల్లడించారు

బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నాడు. చేతిలో 5-6 పాన్ ఇండియా సినిమాలున్నాయి. మరోవైపు మార్చ్ 11న దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ , మలయాలం, కన్నడ భాషల్లో విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా గడుపుతున్నాడు. వృత్తిపరంగా బిజీగా ఉన్న ప్రభాస్..పెళ్లెప్పుడనేది అందరికీ సమాధానం లేని ప్రశ్నగా మిగులుతుంది. మరోవైపు అభిమానుల్లో మాత్రం ప్రభాస్ - అనుష్క ప్రేమ వివాహం, పెళ్లి అంటూ చాలా వార్తలు ట్రోల్ అవుతున్నాయి.

ప్రభాస్ అనుష్కల ప్రేమ, పెళ్లి విషయంలో వార్తలు ట్రోల్ అవుతుంటే..ప్రముఖ జ్యోతిష్యుడు వినోద్ కుమార్ మాత్రం ప్రభాస్ పెళ్లెప్పుడనేది జోస్యం చెప్పేశాడు. రెబెల్‌స్టార్ పుట్టిన తేదీ ప్రకారం..త్వరలో పెళ్లి కానుందని..2022 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్యకాలంలో జరగవచ్చని కూడా చెప్పేశాడు. ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసేవాళ్లు కూడా ఉన్నారు. అసలు పెళ్లెప్పుడు, అనుష్కతో పెళ్లి ఉందా లేదా అనేది ప్రభాస్ మాత్రమే స్పష్టం చేయాలి. ఈ తరుణంలో అతని కుటుంబం నుంచి ఈ విషయంపై బిగ్ క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఇటీవల రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో పెళ్లెప్పుడని ప్రశ్నించినప్పుడు..లవ్ ఫెయిల్యూర్ అంటూ దాటేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే.

మరి ప్రభాస్ అనుష్కల పరిస్థితి ఏంటి

ప్రభాస్, అనుష్కల వివాహంపై చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ అంశంపై ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి స్పందించారు. ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగదంటూ అభిమానుల్ని నిరాశ పరిచారు. ప్రభాస్-అనుష్కలిద్దరూ మంచి స్నేహితులని..ఆ ఇద్దరి మధ్య అసలు లవ్ లేదని..చెప్పుకొచ్చారు. ప్రభాస్ కు సంస్కృతి సంప్రదాయాలు, మహిళలంటే అమితమైన గౌరవమని..ఇంట్లో కుటుంబపెద్దలకు గౌరవం, ప్రాధాన్యత ఇస్తాడని ఆమె చెప్పారు. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వకుండానే దాటేశారు. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినీ పరిశ్రమకు చెందిందా కాదా అనేది తెలియాల్సి ఉంది. త్వరలో ప్రభాస్ పెళ్లి మాత్రం ఖాయమని అర్ధమైంది. 

Also read: Prabhas Marriage: 'రెబెల్ స్టార్' అభిమానులకు శుభవార్త.. ప్రభాస్‌ పెళ్లి ఈ ఏడాదే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News