Pujnab Election Resuls 2022: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం కౌంటింగ్ ట్రెండ్స్ మొదలైనప్పటి నుంచి ఐదు రాష్ట్రాల్లోనూ ఏకపక్ష ఫలితాలే వెలువడుతున్నాయి. ప్రాథమిక ట్రెండ్స్‌లోనే విజయం ఎవరిని వరించనుందనేది దాదాపుగా ఖరారైపోయింది. ఒక్క పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. పంజాబ్‌లో ఆప్ క్లీన్ స్వీప్ దాదాపుగా ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ఈ విప్లవానికి పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు' అంటూ కేజ్రీవాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇదే ట్వీట్లో పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఫోటోలో ఇద్దరు నేతలు విక్టరీ సింబల్ చూపిస్తూ పంజాబ్ విజయోత్సాహంలో మునిగిపోయారు. పంజాబ్‌లో ఆప్ విజయంతో ఆ పార్టీ ఖాతాలో మరో రాష్ట్రం చేరినట్లయింది.
इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022
గత 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆప్ 20 స్థానాలు గెలుచుకుని అక్కడి ప్రధాన పార్టీలకు గట్టి షాకిచ్చింది. ఈ ఐదేళ్ల కాలంలో మరింత బలం పుంజుకున్న ఆ పార్టీ తాజా ఎన్నికల్లో అధికార పగ్గాలు అందుకోలిగింది. ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం పంజాబ్‌లో ఆప్ 90 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాలు, శిరోమణి అకాలీదళ్ 6, బీజేపీ కేవలం 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
గత ఎన్నికల్లో 77 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 20 స్థానాల కన్నా దిగువకు పడిపోవడం గమనార్హం. కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలే ఆ పార్టీని నిండా ముంచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడిన వేళ.. పార్టీ విభేదాలు రచ్చకెక్కడం.. సీఎం అమరీందర్ సింగ్‌ను సాగనంపడం.. కొత్త సీఎం చరణ్జిత్తోనూ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పొసగపోవడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌ను ఈ స్థితికి తీసుకొచ్చాయనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజా ఫలితాలతో కాంగ్రెస్ అంతర్మథనంలో పడిపోగా.. ఆప్‌లో నూతనోత్సాహాం వెల్లివిరుస్తోంది.
Also read: Punjab Election Result 2022: పంజాబ్‌లో అద్భుతం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతున్న ఆప్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook