Jofra Archer: ఆర్చర్ జోస్యం మళ్లీ నిజమైంది.. పంజాబ్‌లో ఆప్‌ స్వీప్‌ చేస్తుందని ముందే తెలుసా?

Jofra Archer Tweet on Punjab Elections. పంజాబ్‌లో తాము సాధించిన విజయంతో జోఫ్రా ఆర్చర్‌ ట్వీటును ఆమ్‌ ఆద్మీ పార్టీ లింక్‌ చేసింది. గతంలో ఆర్చర్‌ చేసిన ట్వీట్‌ను ఈ పోస్ట్‌కి ట్యాగ్‌ చేస్తూ.. 'అవును.. ఆప్‌ పంజాబ్‌ను ఊడ్చేసింది' అని  పేర్కొంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 09:52 AM IST
  • అవును.. ఆప్‌ పంజాబ్‌ను ఊడ్చేసింది
  • ఆర్చర్ జోస్యం మళ్లీ నిజమైంది
  • పంజాబ్‌లో ఆప్‌ స్వీప్‌ చేస్తుందని ముందే తెలుసా?
Jofra Archer: ఆర్చర్ జోస్యం మళ్లీ నిజమైంది.. పంజాబ్‌లో ఆప్‌ స్వీప్‌ చేస్తుందని ముందే తెలుసా?

Jofra Archer old tweet goes viral on AAP's Clean Sweep In Punjab: ఇంగ్లండ్ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పేస్ బౌలింగ్‌తో మేటి బ్యాటర్‌లను సైతం ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే తన బౌలింగ్‌తోనే కాదు ట్వీట్ల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఆర్చర్‌ ఎప్పుడో చెప్పింది వాస్తవ రూపం దాల్చడంతో.. అతని ట్వీట్లు ఎప్పటికపుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. క్రికెట్‌లో ఏది జరిగినా.. ఆర్చర్‌ ముందే చెప్పాడనే ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే అందులో వాస్తవం ఎంతనేది మాత్రం ఆర్చర్‌కే తెలియాలి. 

కేవలం క్రికెట్‌పైనే కాకుండా రాజకీయాలపై కూడా జోఫ్రా ఆర్చర్‌ జోస్యం చెప్పడం, అది నిజమవడం జరుగుతోంది. జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అవుతాడని 2014 అక్టోబర్‌ 4నే అతడు ట్వీట్‌ చేశాడు. చివకు అది నిజం అయింది. ఇక గురువారం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పంజాబ్‌లో జయకేతనం ఎగురవేసింది. పంజాబ్‌లో ఆప్‌ స్వీప్‌ చేస్తుందని ఆర్చర్‌ ముందే చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఆర్చర్‌ చేసిన ఓ ట్వీట్‌లో 'స్వీప్‌' అని అని ఉంది. దాంతో ఆర్చర్‌ ట్వీట్ మరోసారి వైరల్ అయింది. 

పంజాబ్‌లో తాము సాధించిన విజయంతో జోఫ్రా ఆర్చర్‌ ట్వీటును ఆమ్‌ ఆద్మీ పార్టీ లింక్‌ చేసింది. గతంలో ఆర్చర్‌ చేసిన ట్వీట్‌ను ఈ పోస్ట్‌కి ట్యాగ్‌ చేస్తూ.. 'అవును.. ఆప్‌ పంజాబ్‌ను ఊడ్చేసింది' అని  పేర్కొంది. ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆర్చర్‌ గతంలో చేసిన చాలా ట్వీట్లు యాదృచ్చికంగా వాస్తవారికి దగ్గరగా ఉండటంతో.. ఆప్‌ చేసిన ఈ ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగానే ఆర్చర్‌ వద్ద టైమ్‌ మిషీన్‌ ఉందా అని ప్రశ్న కూడా అభిమానులు మనసుల్లో మెదులుతూ ఉంది. 

దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. పంజాబ్‌లోనూ అదే పరంపరను కొనసాగిస్తూ చరిత్ర సృష్టించింది. దీంతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త చర్చకు తెరలేచింది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లు ఉన్న పంజాబ్‌ అసెంబ్లీలో ఆప్‌ 90కి పైగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమైంది. కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదల్‌, బీజేపీలకు షాకిస్తూ.. ఆప్ ఘన విజయం సాదించడంపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. 

Also Read: Radhe Shyam Review: అప్పట్లో శివ.. ఇప్పుడు రాధేశ్యామ్! ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ కాదు..!!

Also Read: Horoscope Today March 11 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు గొడవలకు దూరంగా ఉండాలి! లేదా..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News