Personal Dr. MV Rao's Medical Report about Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఈరోజటి యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్న సీఎం.. హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఉప్పల్ పర్యటన ముగించుకొని.. నేరుగా ఆసుపత్రికి వచ్చారు. ఉదయం 11గంటల 20 నిముషాల సమయంలో కేసీఆర్ కుటుం బసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్ పరీక్షలతో పాటుగా ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ గారి వైద్య పరీక్షలపై ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు స్పందించారు. 'సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. గత రెండు రోజుల నుంచి వీక్‌గా ఉన్నారని చెప్పారు. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. నార్మల్ పరీక్షలు చేశాం. సీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించాము. ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం నిలకడగా ఉంది' అని డాక్టర్ ఎంవీ రావు చెప్పారు.
సీఎం కేసీఆర్ గారికి గుండెకు సంబందించిన సమస్యలు ఏమీ లేవని సమాచారం తెలుస్తోంది. ఊపిరితిత్తులకు సంబందించిన పరీక్షలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారట. ఆసుపత్రిలో కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు మంత్రి కేటీఆర్, కుమార్తె ఎమ్మెల్సీ కవితలు ఉన్నారు. కేటీఆర్ వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది సోమాజిగూడ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిపై వారు ఆరా తీస్తున్నారు.
Also Read: iPhone SE 2022 Bookings: ఐఫోన్ 2022 ప్రీ బుకింగ్స్ నేటి నుంచే.. పూర్తి వివరాలివే..
Also Read: Radhe Shyam Review: అప్పట్లో శివ.. ఇప్పుడు రాధేశ్యామ్! ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ కాదు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook