Aadhaar ration linking: రేషన్ కార్డు, ఆధార్ లింక్‌పై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేషన్ కార్డును ఆధార్‌కు అనుసంధానం చేసేందుకు గడువు పెంచింది. జూన్ 30 వరకు ఆధార్-రేషన్ కార్డు అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఆధార్-రేషన్ కార్డు లింక్ ఎందుకు?
ఆధార్‌కు రేషన్ కార్డును అనుసంధానం చేయడం ద్వారా.. లబ్ధిదారులెవ్వరూ తమ వాటా సబ్సిడీ ఆహార ధాన్యాలను కోల్పోకుండా చూసే వీలుటుంది. అంటే జూన్ 30 తర్వాత ఆధార్‌తో అనుసంధానమున్న రేషన్ కార్డులకు మాత్రమే సబ్సిడీ దుకాణాల్లో ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు.
ఈ ప్రక్రియ ద్వారా మరో ఉపయోగమేమిటంటే.. వలస కార్మికులు లేదా ఇతర ప్రాంతాల్లో నివసించే వారు.. తమకు దగ్గర్లో ఉన్న ఏ రేషన్ షాప్ ద్వారానైనా ఆహార ధాన్యాలను సబ్సిడీలో కొనుగోలు చేసే వీలుటుంది. ముఖ్యంగా ఆహార భద్రత పథకం కింద లభించే ప్రయోజనాలు లబ్ధిదారులకు అందించేందుకు కూడా ప్రభుత్వానికి వీలు పడుతుంది.
వన్ నేషన్ వన్ రేషన్...
2019 ఆగస్టులో.. కేంద్రం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రోజువారీ కూలీలు, వలస కార్మికులు, తాత్కాలిక పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి.. తాము ఉన్న ప్రాంతంలోనే రేషన్ పొందేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకు ఆధార్‌తో రేషన్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసింది.
Also read: Flipkart mobile fest: ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ సేల్.. అన్ని ఫోన్లపై భారీ తగ్గింపు!
Also read: Realme C31: రియల్మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్- తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook