హైదరాబాద్‌లో బయటపడిన అమ్మవారి పురాతన విగ్రహం... తండోప తండాలుగా జనం..

Hindu Goddess Statue found in Excavation: అంబర్‌పేటలో డ్రైనేజ్ నిర్మాణం కోసం జరుపుతున్న తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో అమ్మవారి విగ్రహాన్ని చూసేందుకు జనం తండోప తండాలుగా తరలి వెళ్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 04:15 PM IST
  • హైదరాబాద్ అంబర్‌పేటలో బయటపడ్డ అమ్మవారి విగ్రహం
  • తవ్వకాల్లో విగ్రహాన్ని గుర్తించిన సిబ్బంది
  • అమ్మవారికి ఆలయం కట్టిస్తామని హామీ ఇచ్చిన కార్పోరేటర్
హైదరాబాద్‌లో బయటపడిన అమ్మవారి పురాతన విగ్రహం... తండోప తండాలుగా జనం..

Hindu Goddess Statue found in Excavation: హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో అమ్మవారి పురాతన విగ్రహం ఒకటి బయటపడింది. స్థానిక అహ్మద్ నగర్‌లో డ్రైనేజ్ కాల్వ నిర్మాణం కోసం తవ్వకాలు జరపగా.. అందులో అమ్మవారి రాతి విగ్రహాన్ని గుర్తించారు. విగ్రహం సుమారు 3 అడుగుల మేర ఉంది. అమ్మవారి విగ్రహం బయటపడిందని తెలియగానే చుట్టుపక్కల జనాలంతా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

ఫాల్గుణ బహుళ అష్టమి రోజు అమ్మవారి విగ్రహం బయటపడటం శుభ సంకేతమని.. అది తమ అదృష్టంగా భావిస్తున్నామని కాలనీ వాసులు వెల్లడించారు. పలువురు అమ్మవారి విగ్రహానికి పూల దండలు వేసి పసుపు, కుంకుమతో పూజలు నిర్వహించారు. స్థానిక కార్పోరేటర్ విజయ్ కుమార్ గౌడ్ కూడా అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు.

అమ్మవారికి అక్కడే గుడి నిర్మించాలని ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పోరేటర్‌ను కోరారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సహకారంతో అమ్మవారికి గుడి నిర్మిస్తానని విజయ్ కుమార్ గౌడ్ స్థానికులకు హామీ ఇచ్చారు. ఆలయం నిర్మించేంతవరకూ అక్కడ తాత్కాలిక ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. తవ్వకాల్లో బయటపడ్డ అమ్మవారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: AP New Districts: ఏపీ కొత్త జిల్లాలపై 4-5 రోజుల్లో తుది నోటిఫికేషన్ విడుదల

Also Read: Video: గుండెలు పిండేసే వీడియో.. కూతురి శవాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News