Man Trapped Inside Locker Room in Bank: బ్యాంకులో పని నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిన ఓ వృద్ధుడు రాత్రయినా ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటిరోజు ఉదయం ఆ వృద్దుడు వెళ్లిన బ్యాంకు సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా.. బ్యాంక్ లాకర్ గదిలో అతను చిక్కుకుపోయినట్లు గుర్తించారు. సిబ్బంది నిర్వాకం వల్లే ఇలా జరిగిందని తేల్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం.67లో నివాసముండే కృష్ణారెడ్డి (84) సోమవారం (మార్చి 29) సాయంత్రం 4గం. సమయంలో లాకర్ పని నిమిత్తం జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని యూనియన్ బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ లాకర్ గదిలోకి వెళ్లిన కృష్ణారెడ్డి తన పనిలో నిమగ్నమయ్యారు. కృష్ణారెడ్డి లోపలే ఉన్న విషయాన్ని గమనించని బ్యాంక్ సిబ్బంది లాకర్ గదిని మూసివేశారు. దీంతో సోమవారం రాత్రంతా ఆయన లాకర్ గదిలోనే ఉండిపోయారు.
మరోవైపు, కృష్ణారెడ్డి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఆయన కనిపించట్లేదని ఫిర్యాదు చేశారు. మంగళవారం (మార్చి 29) ఉదయం పోలీసులకు అనుమానం వచ్చి యూనియన్ బ్యాంక్ వద్దకు వెళ్లారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. కృష్ణారెడ్డి లోపలే ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయించి కృష్ణారెడ్డిని బయటకు తీసుకొచ్చారు. కృష్ణారెడ్డికి షుగర్ సమస్య ఉండటంతో వైద్య పరీక్షల నిమిత్తం వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సుమారు 18 గంటల పాటు ఆ వృద్దుడు బ్యాంక్ లాకర్ గదిలోనే ఉండిపోయాడు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
Also Read: Sanskiti Mahotsav: వరంగల్ వేదికగా రెండ్రోజులపాటు జాతీయ సంస్కృతి మహోత్సవాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook