BJP MLA Raja Singh about Hyderabad drugs Case: హైదరాబాద్ నగరం బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయట పడటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు.
ఈ డ్రగ్స్ వ్యవహారంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. గతంలోని డ్రగ్స్ కేసులను కట్టలు కట్టి పక్కన పెట్టారని, ఈ కేసు కూడా అంతే అని అన్నారు. మీడియా సమావేశంలో రాజా సింగ్ మాట్లాడుతూ... 'బంజారాహిల్స్‌లోని పబ్‌లో ఈ రోజు డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ దొరకడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. పెద్ద వీఐపీ, హీరోలు కూడా పట్టుపడ్డారు. కొంతమంది రెడ్ హ్యాండెడ్‌గా కూడా దొరికారు. ఆ కేసు ఏమైంది.. కట్టలు కట్టి పక్కన పడేశారు. ఈ కేసు కూడా అలానే అవుతుంది' అని అన్నారు.
'తెలంగాణలో ఈ డ్రగ్స్ కల్చర్ ఎందుకు వస్తుంది. లోకల్ పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రతిసారి డ్రగ్స్ అమ్మేవారిని పట్టుకుని కొన్ని రోజులు షో చేసి పక్కన పడేస్తారు. నిజమైన పోలీసులు, సీఎం.. డ్రగ్స్ కంట్రోల్స్ చేయాలంటే అవి ఎక్కడినుంచి వస్తున్నాయో కనుక్కుని నెట్ వర్క్ కట్ చేయండి. ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని సీఎంని కోరుతున్నా. సీఎం గారు తెలంగాణ యువతను కాపాడండి. ఎవరైనా డ్రగ్స్ అమ్మితే ఎన్ కౌంటర్ చేయండి. గతంలో చేస్తే మేము సపోర్ట్ చేశాం కదా?' అని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Also Read: Niharika Konidela: నిహారిక తప్పు లేదు.. అనవసర ఊహాగానాలు వద్దు... నాగబాబు రియాక్షన్
Also Read: Hyderabad Rave Party: టాలీవుడ్ లో డ్రగ్స్ కలవరం.. సెలబ్రిటీల ఇళ్లకు పోలీస్ నోటీసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook