డైరక్టర్ చాలా కష్టపడ్డారు.. అంత చీకటిలో చిత్రం చేయడం పెద్ద సాహసమే: హీరో

Abhay 3 Movie Official Trailer out. అభయ్‌ 3 ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన కునాల్‌ కెమ్ము, కెన్‌ ఘోష్‌.. ZEE5 యూనిట్ పాత్రికేయుల సమావేశంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 08:39 PM IST
  • అభయ్‌ 3 ట్రైలర్‌ విడుదల
  • మీరు దేనినైనా ఇష్టపడితే ఎంతో అభిమానం చూపిస్తారు:
  • అంత చీకటిలో చిత్రం చేయడం పెద్ద సాహసమే
డైరక్టర్ చాలా కష్టపడ్డారు.. అంత చీకటిలో చిత్రం చేయడం పెద్ద సాహసమే: హీరో

Kunal Khemu and Asha Negi starrer Abhay 3 Movie Official Trailer out: ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకొంటుంది ZEE5. ప్రతి నెల ZEE5 బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌బస్టర్‌ రిలీజ్‌లతో తెలుగు ఓటీటీ ల్యాండ్‌ స్కేప్‌లో బెంచ్‌మార్క్‌ సెట్‌ చేస్తోంది. తాజాగా అభయ్‌ 1, 2 వెబ్‌ సిరీస్‌లు సక్సెస్‌ అయినందున. అభయ్‌ 3ని తెలుగు వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది  ZEE5. అభయ్ 3లో కునాల్‌ కెమ్ము పోలీస్ ఆఫీసర్‌ (అభయ్‌ ప్రతాప్‌ సింగ్‌) పాత్రలో నటించారు. తన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనేక కొత్త, తెలియని బెదిరింపులను ఎదుర్కొంటాడు. అక్కడ జరుగుతున్న వాటన్నిటినీ ఎలా ఛేదించాడనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథ. 

అభయ్‌ 3 ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన కునాల్‌ కెమ్ము, కెన్‌ ఘోష్‌.. ZEE5 యూనిట్ పాత్రికేయుల సమావేశంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.  అభయ్‌ 3 ట్రైలర్‌ చూసినప్పుడు ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతారు, ఈ సీజన్‌ చీకటిలో క్రూరంగా జరిగిన ఇన్సిడెంట్స్‌ను హీరో చాలా ధైర్యంగా చేధించడం వంటి సీన్స్‌ చూస్తుంటే, రెండు విజయవంతమైన సీజన్‌లను తీసి విమర్శకుల ప్రశంసలు పొందిన ZEE5 ఫ్రాంచైజీ ఇప్పుడు థ్రిల్లర్‌ జానర్‌లో తనదైన ప్రత్యేకతను సృష్టించుకుంటుంది. అభయ్‌ 3 ప్రీమియర్‌ తేదీని ఏప్రిల్‌ 8గా సెట్‌ చేయడంతో అభిమానులు అభయ్‌ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ZEE5 హిందీ, తమిళం మరియు తెలుగులో మాత్రమే ప్రసారం కానుంది.

కునాల్‌ కెమ్ము మాట్లాడుతూ... 'అభయ్‌కి ఇంత ప్రేమను అందించినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు దేనినైనా ఇష్టపడితే ఎంతగా అభిమానం చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది నేను నిజంగా నమ్మిన విషయం అని నిజాయితీగా చెపుతున్నా. ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. దర్శకుడు కెన్‌ ఘోష్‌ కూడా చాలా కష్టపడ్డాడు. అతను నిజంగా అంత చీకటిలో చిత్రం చేయడం పెద్ద సాహసమే. భారతదేశంలోని ప్రముఖ ఫ్రాంచైజీలలో ఒకటైన ZEE5 యొక్క అభయ్‌ సీజన్‌ 3 గురించి మాట్లాడుతున్నందుకు నేను హ్యాపీగా భావిస్తున్నాను. అలాంటి దానిలో భాగమైనందుకు చాలా గర్వంగా కూడా ఉంది' అని అన్నారు. 

దర్శకుడు కెన్‌ ఘోస్‌ మాట్లాడుతూ... 'ప్రేక్షకులు ఇప్పుడు కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు కునాల్‌ కాప్‌గా పని చేయకపోయినా.. తను ఇందులో అద్భుతంగా నటించాడు. ఇందులో చూపిచించిన ప్రతి ఎపిసోడ్‌ కూడా రియల్‌ ఇన్సిడెంట్స్‌. అభయ్‌ 3ని ప్రత్యేకంగా ZEE5 లో ఏప్రిల్‌ 8 నుండి హిందీ, తమిళం మరియు తెలుగులో చూడండి' అని కోరారు. ఇందులో కునాల్‌ కెమ్ము, ఆశా నేగి, నిధి సింగ్‌, విజయ్‌ రాజ్‌, రాహుల్‌ దేవ్‌, విద్యా మాల్వాడే, తనూజ్‌ విర్వాణి  దివ్య అగర్వాల్‌ తదితరులు నటిస్తున్నారు.  

Also Read: Beast Telugu Trailer: భయంగా ఉందా.. దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది! బీస్ట్‌ తెలుగు ట్రైలర్‌ చూస్తే మతిపోవాల్సిందే

Also Read: కంటోన్మెంట్ వాసులకు గుడ్ న్యూస్... కేటీఆర్ చొరవతో రోడ్ల మూసివేత సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

pple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News