Summer Health: ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ , మే దాటితే గాని వేసవి నుంచి కాస్తైనా ఉపశమనం లభించదు. ఎండల తీవ్రత నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరు పద్ధతులున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
సరాసరిన 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు పైగా ఉన్న పరిస్థితులలో డీహైడ్రేషన్ అనేది ఓ పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడి పగటి ఉష్ణోగ్రత 47-48 డిగ్రీలకు కూడా చేరుతుంటుంది. వడగాల్పులు ఎక్కువగా ఉంటుంటాయి. అందుకే వేసవి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరు ప్రత్యేకమైన పద్థతులు చెబుతున్నారు వైద్య నిపుణులు.
వేసవిలో ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ప్రతి గంటకు కనీసం ఓ గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. వేడి నుంచి కాపాడుకోవాలంటే..బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడం తప్పనిసరి. కొబ్బరినీళ్లు, వాటర్ మెలన్ వంటి నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఏ ఫ్రూట్ తింటున్నామనే కంటే..బాడీని హైడ్రేట్‌గా ఉంచుతున్నామా లేదా అనేదే ముఖ్యం.
వేసవిలో కదలకుండా ఒకేచోట కూర్చోవడం మంచిది కాదు. శరీరాన్ని కదల్చాలి. స్పోర్ట్స్, యోగా, డ్యాన్స్ వంటి విభిన్న ప్రక్రియల ద్వారా శరీరానికి యాక్టివిటీ కల్పించాలి. మీదొక వేళ డెస్క్ ఉద్యోగమైతే..భోజనం తరువాత కాస్త నడక అలవాటు చేసుకోవాలి. వేసవిలో ఏ ఆహారం తింటున్నామనేది కూడా చాలా ముఖ్యం. వేసవిలో మితంగా భోజనం తీసుకోవడమే మంచిది. ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకు 3 సార్లు ఎక్కువగా తినేకంటే..రోజుకు 5 సార్లు తక్కువగా తీసుకోవడం ఉత్తమం. అదే సమయంలో శరీరంలో షుగర్ పరిమితంగా ఉండేట్టు చూసుకోవాలి. వాటరీ ఫ్రూట్స్ ఎక్కువగా అలవాటు చేసుకోవాలి.మనసు, శరీరం ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. అందుకే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుండేట్టు చూసుకోవాలి. వేసవిలో సాధ్యమైనంత ఎక్కువ నిద్ర ఉంటే మంచిది. ఎక్కువ అంటే రాత్రంతా పూర్తిగా నిద్రపోయేట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మరుసటి రోజ పగలంతా ప్రశాంతంగా, యాక్టివ్‌గా ఉంటాము. ఈ అలవాట్లు చేసుకుంటే వేసవిలో ఆరోగ్యంగా సంరక్షించుకోవచ్చు. ఏ విధమైన డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడుకోవచ్చు.
Also read: Black Pepper Uses: గోరువెచ్చని నీళ్లలో మిరియాల పౌడర్ కలుపుకుని తాగితే కేన్సర్ కూడా దూరమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook