Vira l Poster:క్రికెట్ పిచ్చి..క్రికెట్ అభిమానం మగవారి కంటే అమ్మాయిలకే ఎక్కువేమో. మొన్న విరాట్ కోహ్లీ సెంచరీ వరకూ డేటింగ్ చేయనని ఓ అమ్మాయి..ఇప్పుడీ అమ్మాయి ఇలా. మరో సంచలనానికి తెరతీసింది.
ఐపీఎల్ 2022 12వ మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయంతో సీఎస్కే తొలి బోణీ చేసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే అద్భుత ప్రదర్శన, అంబటి రాయుడు అత్యద్భుత క్యాచ్ ఇవేవీ చర్చనీయాంశం కాలేదు గానీ..ఆ అమ్మాయి పోస్టర్ మాత్రం హల్చల్ చేస్తోంది. ఇప్పటికే మొన్న ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్రేజ్ చూపించింది ఓ అమ్మాయి. కోహ్లీ సెంచరీ చేసేవరకూ డేటింగ్ చేయనంటూ ఏకంగా అందరి ముందూ స్డేడియంలో బ్యానర్ ప్రదర్శించి కెమేరాలకెక్కింది. ఆ దృశ్యం మరువకముందే ఇప్పుడు మరో అరుదైన దృశ్యాన్ని మరో అమ్మాయి సాక్ష్తాత్కరింపజేసింది.
చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో ఓ అమ్మాయి ఫోస్టర్‌తో స్డేడియంలో అడుగెట్టింది. మ్యాచ్ జరుగుతుండగా..ఆ పోస్టర్ ప్రదర్శించింది. అందులో రాసిన కంటెంట్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచే వరకూ పెళ్లి చేసుకోనంటూ శపధం చేసింది ఆ అమ్మాయి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రౌండ్లో అందరి దృష్టీ..కెమేరాలన్నీ ఆ పోస్టర్‌పైనే ఫోకస్ చేశాయి. ఆర్సీబీ ప్రదర్శన బాగానే ఉన్నా..ట్రోఫీ మాత్రం సాధించలేకపోతోంది. మరి ఆర్సీబీ ఎప్పుడు ట్రోఫీ సాధిస్తుంది..ఆ అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది..
మొత్తానికి ఓ అమ్మాయి డేటింగ్ విరాట్ కోహ్లీ సెంచరీతో లింకై ఉంటే..మరో అమ్మాయి పెళ్లి ఆర్సీబీ ట్రోఫీ విన్నింగ్‌తో ఆధారపడి ఉంది.
Also read: RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు బోణీ కొట్టిన సీఎస్కే, మరి ముంబై పరిస్థితి ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook