CSK Innings: విధ్వంసకర ఇన్నింగ్స్ అంటే ఇదేనా, 60 బంతుల్లో 157 పరుగులా...ఎలా సాధ్యం

CSK Innings: గతంలో నాలుగు సార్లు ఛాంపియన్..ఈసారి నాలుగు వరుస ఓటములతో అవమానం. కసి పెరిగిందో..అవమానం గుర్తుకొచ్చిందో..విధ్వసం కొనసాగించింది. ఊహించని విద్వంసకర ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2022, 10:51 AM IST
CSK Innings: విధ్వంసకర ఇన్నింగ్స్ అంటే ఇదేనా, 60 బంతుల్లో 157 పరుగులా...ఎలా సాధ్యం

CSK Innings: గతంలో నాలుగు సార్లు ఛాంపియన్.. ఈసారి నాలుగు వరుస ఓటములతో అవమానం. కసి పెరిగిందో.. అవమానం గుర్తుకొచ్చిందో.. విధ్వసం కొనసాగించింది. ఊహించని విద్వంసకర ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించింది.

ఐపీఎల్ 2022లో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ నిజంగా ఓ అద్భుతం. గతంలో నాలుగుసార్లు టైటిల్ గెల్చిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఈసారి వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కొంది. ఘోర అవమానాల మధ్య ఐదవ మ్యాచ్ ఆర్సీబీతో తలపడింది. కసి పెరిగిందో.. అవమానం గుర్తుకొచ్చిందో గానీ.. విధ్వంసకర ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించింది. అది కూడా ఇన్నింగ్స్ రెండవ సగంలోనే. ఆ వివరాలు పరిశీలిద్దాం..

ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత సీఎస్కే బ్యాటింగ్‌కు దిగింది. ముందు ఇన్నింగ్స్ కష్టంగానే ప్రారంభమైంది. పవర్ ప్లేలో 1 వికెట్ నష్టానికి 35 పరుగులు మాత్రమే చేసింది. క్రమంగా రుతురాత్, మొయిన్ అలీ నిష్క్రమించారు. శివమ్ దూబే బరిలో దిగాడు. కష్టాల్లో ఉన్న జట్టును సరిదిద్దే ప్రయత్నం చేశాడు. 8 ఓవర్లకు 50 పరుగులు..ఆ తరువాత పది ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కేవలం 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే ఇన్నింగ్స్ సగం ఆట పూర్తయింది. ఆర్సీబీ బౌలింగ్‌ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అంతే.. ఆ తరువాత ఒక్కసారిగా ఏం జరిగిందో అర్ధం కాలేదు ఎవరికీ...

హుదూద్ తుపాను బీభత్సం గ్రౌండ్‌లో కన్పించింది. రాబిన్ ఊతప్ప, శివమ్ దూబేలు పూనకం వచ్చినట్టు రెచ్చిపోయారు. వచ్చే ప్రతి బౌల్‌ను సిక్సర్ లేదా బౌండరీకు తరలించడమే పనిగా పెట్టుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఊహకందని విధ్వంసం కొనసాగింది. కేవలం పది ఓవర్లలో అంటే 60 బంతుల్లో 156 పరుగులు సాధించి అందర్నీ విస్మయపర్చింది. శివమ్ దూబే 46 బంతుల్లో 5 పోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అటు రాబిన్ ఊతప్ప 50 బంతుల్లో 4 ఫోర్లు , 9 సిక్సర్లతో 89 పరుగులు సాధించాడు. ప్రతి ఒక్కరి బౌలింగ్ ఎకానమీ దారుణంగా దెబ్బతింది. బౌలింగ్ ఎవరికివ్వాలో అర్ధం కాక.. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ తలపట్టుకున్న పరిస్థితి.

ఈ మ్యాచ్‌లో రాబిన్ ఊతప్ప-శివమ్ దూబే జంట సరికొత్త రికార్డు నమోదు చేసింది. 165 పరుగులతో రెండవ అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పింది. తొలి స్థానంలో షేన్ వాట్సన్- డుప్లెసిస్ 2020లో 181 పరుగులు చేసింది. 

Also read: Moeen Ali Run Out: అద్భుత ఫీల్డింగ్‌తో మొయిన్ అలీని రనవుట్ చేసిన ప్రభుదేశాయ్, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News