KGF 2 Box Office Day 2: కేజీఎఫ్​-2 వసూళ్ల సునామీ- రెండు రోజుల్లోనే రూ.300 కోట్లు!

KGF 2 Box Office Day 2: భారీ అంచనాల నడుమ విడుదలైన కేజీఎఫ్​ ఛాప్టర్​-2 బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.200 కోట్ల నెట్ సాధించినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 02:32 PM IST
  • కేజీఎఫ్​-2 వసూళ్లు వర్షం
  • రెండో రోజుకే రూ.200 కోట్ల నెట్​
  • గ్రాస్ రూ.300 కోట్ల పైమాటే..!
KGF 2 Box Office Day 2: కేజీఎఫ్​-2 వసూళ్ల సునామీ- రెండు రోజుల్లోనే రూ.300 కోట్లు!

KGF 2 Box Office Day 2: యష్ హీరోగా నటించిన కేజీఎఫ్​ ఛాప్టర్​ 2 సూపర్ హిట్ టాక్​తో దూసుకెళ్తోంది. దీనితో థియేటర్లలో వసూళ్ల సునామీ కొనసాగుతోంది. మొదటి రోజుకు ధీటుగా రెండో రోజు కూడా కలెక్షన్లు నమోదైనట్లు సినీ విశ్లేషకులు ద్వారా తెలిసింది.

తొలి రోజు అంచనాలకు మించి రూ. 135 కోట్ల వరకు వసూళ్లు సాధించిన ఈ మూవీ రెండో రోజు కూడా జోరును కొనసాగించింది. రెండో రోజు ఈ మూవీ రూ. 86-88 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లు తెలిసింది. తొలి రెండు రోజుల్లోనే.. అన్ని భాషల్లో కలిపి ఈ మూవీ రూ. 202-204 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు వెల్లడైంది. లాంగ్ వీకెంట్ రావడంతో సినిమాకు ప్లస్ పాయింట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. శనివారానికి టికెట్ బుకింక్స్ అంచనాలను లెక్కలోకి తీసుకుంటే.. మూడు రోజుల్లో రూ. 300 కోట్ల వసూళ్లు (నెట్​) సాధించడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఒక్క హిందీలోనే ఈ మూవీ మొదటి రోజు రూ. 53.95 కోట్లు, రెండో రోజు రూ. 46.79 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. మరో సినీ  విశ్లేషకులు రమేశ్​ బాలా రెండు రోజుల్లోనే కేజీఎఫ్​-2 గ్రాస్​ రూ. 300 కోట్లు దాటినట్లు ట్వీట్​ చేశారు.

కేజీఎఫ్​-2 గురించి..

కన్నడ దర్శకుడు ప్రశాంత్​ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఏ అంచనాలు లేకుండా వచ్చిన చాప్టర్​-1 సూపర్​ హిట్​ టాక్ తెచ్చుకుని.. అంచనాలకు మించి వసూళ్లు సాధించింది. దీనితో రెండో భాగం అయిన కేజీఎఫ్​-ఛాప్టర్​-2పై భారీ అంచనాలు వచ్చాయి. అన్ని భాషల్లో ఈ మూవీకోసం సినీ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురు చూశారు. కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఏప్రిల్ 14న ఈ మూవీ విడుదలైంది. ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా ఉన్నట్లు టాక్ రావడంతో.. వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.

ఈ సినిమాలో యశ్​కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. సంజయ్ దత్​, ప్రకాశ్​ రాజ్​, రావు రమేష్​, రవీణా తాండన్​ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. కన్నడలో తీసిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోకి డబ్​ అయ్యింది.

Also read: Alia Ranabir Kissing Video: అలియా ముందు మోకరిల్లి... ముద్దుతో ప్రేమను వ్యక్తపరిచిన రణబీర్ కపూర్...

Also read: Mobile Theatre: ఏపీలో తొలి మొబైల్ థియేటర్, ఆచార్య సినిమాతో ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News