పట్టు వస్త్రంపై రామాయణం.. 32 వేల సార్లు 'జై శ్రీరామ్' నామం... చీరపై చేనేత కళాకారుడి అద్భుత డిజైన్..

Ramayana and Jai Sri Ram Slogans on Saree: ధర్మవరంకు చెందిన ఓ చేనేత కళాకారుడు పట్టు వస్త్రంపై రామాయణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. చీరపై జై శ్రీరామ్ నామాన్ని 32 వేల సార్లు డిజైన్ చేశాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 11:58 AM IST
  • చేనేత కళాకారుడి అద్భుత ఆవిష్కరణ
  • చేనేత చీరపై రామాయణ సుందరకాండ ఘట్టం
  • 32 వేల సార్లు జై శ్రీరామ్ నామం
 పట్టు వస్త్రంపై రామాయణం.. 32 వేల సార్లు 'జై శ్రీరామ్' నామం... చీరపై చేనేత కళాకారుడి అద్భుత డిజైన్..

Ramayana and Jai Sri Ram Slogans on Saree: ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన చేనేత కళాకారుడు జురాజు నాగరాజు అద్భుతం ఆవిష్కరించాడు. 60 మీటర్ల పట్టు వస్త్రంపై 13 భాషల్లో 32,200 సార్లు 'జై శ్రీరామ్' నామాన్ని డిజైన్ చేశాడు. అంతేకాదు, ఆ పట్టు వస్త్రంపై రామాయణ ఘట్టాలను సైతం డిజైన్ చేశాడు. నాగరాజు నేసిన ఈ చీరను చూసి చాలామంది అబ్బురపడుతున్నారు. ఆయన ప్రతిభను అభినందిస్తున్నారు.

తాను స్వయంగా రూపొందించిన ఈ ప్రత్యేకమైన పట్టు వస్త్రాన్ని 'రామ కోటి వస్త్రం'గా పిలుస్తున్నట్లు నాగరాజు తెలిపాడు. ఈ పట్టు వస్త్రంపై రామాయణ సుందరకాండలోని 168 ఘట్టాలను కళ్లకు కట్టేలా డిజైన్ చేసినట్లు వెల్లడించాడు. అయితే ఇది అంత సులువుగా సాధ్యం కాలేదని... ఇందుకోసం ఎంతో వ్యయప్రయాస తప్పలేదని అన్నాడు. 

16 కేజీల బరువు, 44 ఇంచుల వెడల్పు ఉన్న ఈ చీరను డిజైన్ చేసేందుకు 4 నెలల సమయం పట్టిందన్నాడు. ఇందుకోసం రూ.1.5 లక్షలు ఖర్చయిందన్నాడు. చీరను రూపొందించేందుకు తనతో పాటు మరో ముగ్గురు కూడా కృషి చేసినట్లు తెలిపాడు. ఈ చీరను అయోధ్య రామాలయంలో రాముడికి సమర్పించనున్నట్లు చెప్పుకొచ్చాడు.

Also Read: Flipkart Summer Sale: ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్.. రూ.5,290లకే గోద్రేజ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్!

Also Read: Sun Transit 2022: మేష రాశిలోకి సూర్యుడు... ఆ 3 రాశుల వారికి అంతా శుభమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News