David Warner Record: డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత, మరో రికార్డుకు 24 పరుగుల దూరం

David Warner Record: డేవిడ్ వార్నర్. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన వ్యక్తి. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2022, 02:40 PM IST
  • ఒకే ప్రత్యర్ధి జట్టుపై వేయి పరుగులు పూర్తి చేసిన రెండవ ఆటగాడిగా రికార్డు నమోదు చేసిన డేవిడ్ వార్నర్
  • పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుపై 1 వేయి 5 పరుగులు సాధించిన వార్నర్
  • గతంలో కేకేఆర్ జట్టుపై వేయి 18 పరుగులతో రోహిత్ శర్మ
David Warner Record: డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత, మరో రికార్డుకు 24 పరుగుల దూరం

David Warner Record: డేవిడ్ వార్నర్. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన వ్యక్తి. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు.

ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్, మాజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఢిల్లీ కేపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్. క్రికెట్‌లోనే కాదు ఫన్నీ విషయాల్లో కూడా సందడి చేస్తుంటాడు. క్రికెట్‌లో ఇక పరుగుల వరదే సృష్టిస్తుంటాడు. అప్పుడప్పుడూ టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తూ..వీడియోలు విడుదల చేస్తూ హల్‌చల్ చేస్తుంటాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నంతవరకూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన వ్యక్తి. 

ఇప్పుడు జట్టు మారాడు. ఢిల్లీ కేపిటల్స్ తరపున ఆడుతున్నాడు. అక్కడ కూడా పరుగుల వరదే. ఏప్రిల్ 20 అంటే బుధవారం పంజాబ్ కింగ్స్ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఒకే ప్రత్యర్ధి జట్టుపై వేయి పరుగులు పూర్తి చేయడం. పంజాబ్ కింగ్స్ లెవెన్‌పై వేయి పరుగులు సాధించి..ఒక ప్రత్యర్ధిపై అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ కంటే ముందు రోహిత్ శర్మ..కేకేఆర్ జట్టుపై 1 వేయి 18 పరుగులు చేశాడు. అదే సమయంలో డేవిడ్ వార్నర్ ఇటువంటిదే మరో రికార్డు నెలకొల్పేందుకు ఎంతోదూరంలో లేడు. పంజాబ్‌పై 1 వేయి 5 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్...కేకేఆర్ జట్టుపై ఇప్పటి వరకూ 976 పరుగులు చేశాడు. అంటే మరో 24 పరుగులు పూర్తయితే..మరో ప్రత్యర్ధి జట్టుపై కూడా వేయి పరుగులు చేసిన ఘనత సాధిస్తాడు. అంటే రెండు ప్రత్యర్ధి జట్లపై చెరో వేయి పరుగులు సాధించిన తొలి ఆటగాడు కానున్నాడు. విరాట్ కోహ్లి కోసం కూడా ఇలాంటి ఓ రికార్డు ఎదురు చూస్తోంది. కోహ్లీ..సీఎస్కేపై ఇప్పటి వరకూ 949 పరుగులు చేశాడు. మరో 51 పరుగులు చేస్తే..విరాట్ కోహ్లీకు కూడా ఆ రికార్డు దక్కుతుంది. 

గత సీజన్ వరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన డేవిడ్ వార్నర్ ఈసారి జట్టు మారాడు. ఢిల్లీ కేపిటల్స్ జట్టు 6.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్..191 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 53 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

Also read: CSK vs MI: ముంబై వర్సెస్ చెన్నైకు చావో రేవో..సీఎస్కే జట్టుకు షాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News