Meerakt fight Cobra Video: సోషల్ మీడియోలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు (Animal Videos) నెట్టింట తెగ హల్ చల్ చేస్తాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. పాము, ముంగిసల శత్రుత్వం గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ రెండు ఎదురుపడితే ఒక్కదానికొకటి పోట్లాడుకుంటాయి. తాజాగా ఓ ముంగిసల గుంపుకు, కింగ్ కోబ్రాకు మధ్య జరిగిన ఫైట్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
వీడియోలో.. అడవిలో ఒక నాగుపాము ఒంటరిగా నడుస్తోంది. ఆ సమయంలో, మీర్కాట్స్ (Meerakt) అనే ఆఫ్రికన్ ముంగిసలు ఒక గుంపుగా ఏర్పడి కింగ్ కోబ్రాపై (King Cobra) దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. వాటిపైకి కింగ్ కోబ్రా బుసలు కొడుతూ దాడి చేస్తోంది. ఇలా చాలా సేపు జరుగుతోంది. అయితే వీడియో చివర్లో ఏం జరిగిందో చూపించలేదు. ముంగిసలన్నీ చూస్తుండగా...కోబ్రా వెళ్లిపోతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మీర్కట్ దక్షిణాఫ్రికా అడవులలో కనిపిస్తాయి. దీనిని ఆఫ్రికన్ వీసెల్ అంటారు. ఇది ఒక విధంగా ముంగూస్ యొక్క చిన్న జాతి అని పిలుస్తారు. నేషనల్ జియోగ్రాఫిక్ యూకే యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేయబడింది.
Also Read: Viral Video: ఆడపులి కోసం ఆర్ఆర్ఆర్ మూవీ రేంజ్ లో ఫైటింగ్.. చివరికి గెలిచిందెవరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook