bjp public meeting at mahaboobnagar: పాలమూరులో బీజేపీ బహిరంగ సభ, జేపీ నడ్డా సంచలన కామెంట్లు

bjp public meeting at mahaboobnagar: పాలమూరులో బీజేపీ బహిరంగ సభ కమలం పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర 22 రోజులు పూర్తైన సందర్భంగా పాలమూరులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే అని స్పష్టంచేశారు.

Last Updated : May 5, 2022, 09:46 PM IST
  • పాలమూరులో బీజేపీ బహిరంగ సభ
    హాజరైన జేపీ నడ్డా
    టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు
bjp public meeting at mahaboobnagar: పాలమూరులో బీజేపీ బహిరంగ సభ, జేపీ నడ్డా సంచలన కామెంట్లు

bjp public meeting at mahaboobnagar: పాలమూరులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టీఆర్ఎస్ సర్కారుపై సంచలన కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సమితి అని ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్ కేసీఆర్ సర్కారే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ రెట్టింపు అభివృద్ధి సాధింస్తుందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ లో విజయాలతో బీజేపీ సత్తా ఏంటో టీఆర్ఎస్ కు తెలిసిందన్నారు. 

పాలమూరు ప్రజలపై కేసీఆర్ పగబట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్. ఆర్డీఎస్ కాల్వ ఆధునీకరణకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సహకరిస్తే ఆరునెలల్లో మోడీ ప్రభుత్వం ఆర్డీఎస్ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. తన పాదయాత్రలో ఎక్కడ చూసినా ఎండిన ఎడారి పరిస్థితులే కనిపించాయన్నారు.  14వందల కోట్లు ఖర్చుచేస్తే పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు.  గ్రూప్‌ 1 ఎగ్జామ్స్ లో ఉర్దూ ప్రవేశపెట్టి ప్రభుత్వ ఉద్యోగాలను ఎంఐఎంకు తాకట్టుపెట్టిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉర్దూలో ఎగ్జామ్ రాసి సెలక్టయిన వారిని తొలగిస్తామన్నారు. 

కేసీఆర్, ఓవైసీ కుటుంబాల చేతిలో తెలంగాణ తల్లి బందీఅయిపోయిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఫామ్‌హౌజ్ లో ఉన్న ముఖ్యమంత్రికి ఎన్నికలంటే భయమేస్తోందన్నారు. ఓవైసీ తలకిందులుగా తపస్సుచేసినా కేసీఆర్ సర్కార్ ను కాపాడలేడన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎగిరేది ముమ్మాటికీ బీజేపీ జెండానే అని స్పష్టంచేశారు కిషన్ రెడ్డి.

కాపలాకుక్కలా ఉండి పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేస్తానన్న కేసీఆర్ ఎక్కడపోయాడని ప్రశ్నించారు మాజీ మంత్రి డీకే అరుణ. కేసీఆర్ మాటలు నమ్మి ఇప్పటికే ఎన్నోసార్లు పాలమూరు మోసపోయిందన్నారు. టీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు , ఇసుక దందాలు చేస్తున్నారని.. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. 

పాలమూరులో బీజేపీకి ఆదరణ చూసి కేసీఆర్ కు గుండెపోటు వస్తుందేమోనన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కేటీఆర్ కాకిలెక్కలు చెబుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ తీసుకునే కొకైన్‌లో కల్తీ లేకుంటే లెక్కలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. అటు కేసీఆర్ పాలనలో దక్షిణ తెలంగాణ ఉద్యమం వస్తదేమోనని భయమవుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆర్టీసీవాళ్లు పక్క రాష్ట్రాల్లో డీజిల్ ఎందుకు పోయించుకుంటున్నారో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

also read: Political Heat In Telangana: తెలంగాణలో జాతీయ నేతల టూర్లు..మొదలైన ఎన్నికల జాతర

also read: Prashant Kishor Comments: కొత్తపార్టీ పెట్టడం లేదన్న ప్రశాంత్‌ కిషోర్‌ - కొత్త ప్లానేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
 

Trending News