Horoscope Today May 9 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారిని ఇవాళ ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నెగటివ్ వైబ్రేషన్స్ కారణంగా కొంతమందికి పూర్తి నిరాశజనకమైన ఫలితాలు ఉంటాయి. మరికొందరికి పాజిటివ్ ఎనర్జీ తోడై అంతా మంచే జరుగుతుంది. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...
మేషరాశి ( Aries)
ఇవాళ మిమ్మల్ని నెగటివ్ వైబ్రేషన్స్ వెంటాడుతాయి. రోజంతా అసంతృప్తిగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాలి. స్నేహితులు, సన్నిహితుల సహకారం కొరవడుతుంది. ఎవరి నుంచి ఎక్కువ సాయం ఆశించవద్దు. స్వతంత్ర నిర్ణయాలే ఇవాళ కలిసొస్తాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లలతో గడపడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది.
వృషభ రాశి (Taurus)
ఇవాళ మూడీగా, నిరాసక్తతతో ఉంటారు. అది మీ ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. పెట్టుబడుల విషయంలో మీ అంతరంగాన్ని ఫాలో అవండి. రెగ్యులర్ వర్క్‌లో మీ కొలిగ్స్ సహకారం కొరవడుతుంది. తిండి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది తినవద్దు. అనారోగ్యకరమైన తిండి కారణంగా పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.
మిథున రాశి (GEMINI)
ఇవాళ మీరు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఇంటికి సంబంధించి మరమత్తులు చేపడుతారు. ఇంటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. కష్టంలో ఉన్నవారికి తోచిన సాయం చేస్తారు. సామాజికంగా మీ పలుకుబడి పెరుగుతుంది.
కర్కాటక రాశి (Cancer)
వ్యాపార రంగంలో ఉన్నవారికి కలిసొస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. గతంలో చవిచూసిన నష్టాలు ఇప్పుడు లాభాలుగా మారుతాయి. మీ తెలివితేటలతో వ్యాపారం పురోగమిస్తుంది. అకడమిక్ కోర్సులతో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలకు విరాళాలు అందజేస్తారు. విద్యార్థులు బాగా రాణిస్తారు.
సింహ రాశి (LEO)
ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందిపెడుతాయి. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపార విషయంలో కీలక నిర్ణయాలు కొన్నాళ్లు వాయిదా వేయడం మంచిది. పెద్దల ఆశీస్సులతో సాయంత్రానికి అన్నీ సర్దుకుంటాయి. మళ్లీ గుడ్ టైమ్ స్టార్ట్ అవుతుంది. అప్పటివరకూ కాస్త ఓపికగా వ్యవహరించాలి.
కన్య రాశి (Virgo)
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఎట్టకేలకు పట్టాలెక్కిస్తారు. పెద్దల ఆశీస్సులతో గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. మీలో సృజనాత్మక వెల్లివిరుస్తుంది. ఇంటి కోసం కొన్ని కళాకృతులు కొనుగోలు చేస్తారు. పెళ్లి సంబంధాల వేటలో ఉన్నవారికి మంచి సంబంధం కుదరవచ్చు.
తులా రాశి (Libra)
ఇవాళ మీకు ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ బాస్ మీకు బాగా సాయపడుతారు. ఉద్యోగ రీత్యా ప్రమోషన్ దక్కవచ్చు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగి అనుబంధం మరింత బలపడుతుంది.
వృశ్చిక రాశి (Scorpio)
చంద్ర అనుగ్రహం మీపై ఉంటుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు, ఇతర తగాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. కుమార్తె లేదా కుమారుడి పెళ్లి కోసం సంబంధాలు చూడటం ప్రారంభిస్తారు. పెళ్లి సంబంధిత నిర్ణయాల్లో ఆచీ తూచీ వ్యవహరించాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
ధనుస్సు రాశి (Sagittarius)
ఇవాళ చంద్ర అనుగ్రహం కలగదు. రోజంతా నిరాశజనకంగా గడుస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతాయి. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. అంతగా విలువ లేని ప్రాజెక్టుల్లో డబ్బులు పెట్టుబడిగా పెట్టవద్దు. వివాదాల్లో తలదూర్చవద్దు. వివాదాల్లో తలదూరిస్తే అది మీ జీవితాన్నే తలకిందులు చేయొచ్చు. దాని ప్రభావం చాలా రోజులు వెంటాడుతుంది.
మకర రాశి (Capricorn)
సింగిల్స్‌కి మంచి సంబంధం కుదరవచ్చు. వృత్తి రీత్యా బాగా రాణిస్తారు. మీ స్నేహితులు, కొలిగ్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు. అనవసర వ్యవహారాల్లో మీకు మీరుగా తలదూర్చవద్దు. బయటి గొడవలు ఇంటి దాకా తీసుకెళ్లవద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius)
మీలోని ఆత్మవిశ్వాసం మీరు చేస్తున్న పనిలో ప్రతిబింబిస్తుంది. ప్రత్యర్థులపై మీదే పైచేయి అవుతుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా తగిన కృషి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అనవసర వివాదాల్లో వాదనలకు దిగవద్దు. అది మీ కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని ప్రేమించేవారిని గౌరవించండి. వారు నొచ్చుకునేలా వ్యవహరించకండి.
మీన రాశి (Pisces)
ఇవాళ మీలో పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేస్తారు. పిల్లలు చదువుల్లో రాణించడం తల్లిదండ్రులను సంతోషపెడుతుంది. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా అప్డేట్ చేసుకుంటారు. ఉన్నదాంట్లో సర్దుకుపోయే మనస్తత్వంతో జీవితం సంతృప్తికరంగా సాగుతుంది.
Also Read: CSK vs DC: ఛాంపియన్‌లా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్‌పై ఘన విజయం
Also Read: Drunk Men Created Ruckus: వైన్ షాప్ ముందే మందు బాబుల వీరంగం.. నడిరోడ్డుపై ఫైటింగ్ సీన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook